Dhulipalla : దూళిపాళ్ల అరెస్టుతో ఏపీలో పొలిటికల్ ఫైట్ షురూ.. అనంతపురం నుంచి సిక్కోలు దాకా ఒకటే రచ్చ
Dhulipalla : మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత దూళిపాళ్ల అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ లో అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం మొదలైంది. కక్ష సాధింపుల్లో భాగంగా అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తే..
Dhulipalla Narendra Arrest : మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత దూళిపాళ్ల అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ లో అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం మొదలైంది. కక్ష సాధింపుల్లో భాగంగా అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తే.. అవినీతికి పాల్పడితే చట్టం తన పనితాను చేసుకుపోతుందని కౌంటర్ ఇస్తున్నాయి వైసీపీ శ్రేణులు. ఫలితంగా ఏపీలో మరోసారి ప్రభుత్వం వెర్సస్ టీడీపీ. సవాళ్లు, కేసులతో రాజకీయం హోరాహోరీగా మారింది. అనంతపురం నుంచి సిక్కోలు దాకా ఒకటే రచ్చ షురూ అయింది. ఇలాఉండగా, ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసింది ఏసీబీ. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలో ధూళిపాళ్లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్టు అతని సతీమణికి నోటీసు ఇచ్చారు. ఆయనపై 408, 409, 418, 420, 465 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయని ఆయనపై ఆరోపణలు మోపారు. తెల్లవారుజామునే 100 మందికి పైగా పోలీసులు నరేంద్ర ఇంటికి వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేశారు. కాగా, సంగం డెయిరీని దెబ్బతీసి అమూల్‌కు కట్టబెట్టేందుకే దూళిపాళ్లను అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. రెండేళ్ల పాలనలో అక్రమ అరెస్ట్‌లు తప్ప.. అభివృద్ధి లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమపై కక్ష సాధిస్తున్నారు.. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో ఎవరూ మిగలరన్నారు బాబు. పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచక, అటవికపాలన సాగిస్తున్నారు అంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. ఇలాఉంటే, ధూళిపాళ్ల అరెస్ట్‌కు రాజకీయ కారణాలు లేవన్నారు ఎమ్మెల్యే కిలారి రోశయ్య. అమూల్ సంస్థ కోసం అరెస్ట్ చేశారనడం సరికాదన్నారు. సంగం డెయిరీలో అనేక రకాల అవకతవకలు జరిగినట్టు.. ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయంటున్నారు వైసీపీ నేతలు. .
మరిన్ని ఇక్కడ చూడండి: మహిళలల్లో మల్టీ విటమిన్స్, Omega-3, ప్రోబయోటిక్స్ కరోనాను తగ్గిస్తాయా ? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే…
Corona Virus: కరోనా బాధితులలో పురుషులే అధికం.. తాజా అధ్యయనాల్లో బయటపడ్డ షాకింగ్ విషయాలు..