మహిళలల్లో మల్టీ విటమిన్స్, Omega-3, ప్రోబయోటిక్స్ కరోనాను తగ్గిస్తాయా ? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే…

మహిళలలో మల్టీవిటమిన్స్, ఒమేగా-3, ప్రోబయోటిక్స్ లేదా విటిమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వలన కరోనా బారిన

  • Rajitha Chanti
  • Publish Date - 4:29 pm, Fri, 23 April 21
మహిళలల్లో మల్టీ విటమిన్స్, Omega-3, ప్రోబయోటిక్స్ కరోనాను తగ్గిస్తాయా ? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే...
Multivitamins

మహిళలలో మల్టీవిటమిన్స్, ఒమేగా-3, ప్రోబయోటిక్స్ లేదా విటిమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వలన కరోనా బారిన పడకుండా ఉంటారా? ఇదే విషయంపై BMJ న్యూట్రిషన్ ప్రివెన్షన్ & హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన ఓ అధ్యయనం ప్రకారం విటమిన్ సీ, జింక్ లేదా గార్లిక్ పదార్థాలు కలిగిన సప్లిమెంట్స్ తీసుకోవడం వలన కరోనా బారిన పడే అవకాశాలు లేకపోలేదని తెలిపింది. యూకేలోని కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకలు కరోనా లక్షణాల కోసం ఓ అధ్యయనం జరిపింది. అందులో నడివయస్కులకు కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఎలా ఉన్నారో తెలుసుకున్నారు. వారిలో ఈ వైరస్ వలన ఎలాంటి మార్పులు జరిగాయనేది పరీక్షించారు.

గతేడాది ఈ వైరస్ బారిన పడిన మే, జూన్, జూలై 2020లో మొత్తం 372,720 మంది కరోనా బాధితులస ఆహారపదార్థాలను క్రమం తప్పకుండా అందించారు. అందులో మే, జూలై మధ్య, 175,652 కొంతమంది క్రమం తప్పకుండా ఆహార పదార్ధాలను తీసుకున్నారు, అయితే 197,068 మంది తీసుకోలేదు. మూడింట రెండొంతుల (67 శాతం) మహిళలు, సగానికి పైగా అధిక బరువు కలిగి ఉన్నారు. మొత్తం 23,521 మంది SARS-CoV-2 కు పాజిటివ్ పరీక్షలు చేయగా, 349,199 మంది మే, జూలై పాజిటివ్ అని వచ్చింది. ప్రోబయోటిక్స్, ఒమేగా కొవ్వు ఆమ్లాలు, మల్టీవిటమిన్లు లేదా విటమిన్ డి తీసుకోవడం వలన కరోనా వచ్చే ప్రభావం తక్కువగా ఉందని తెలీంది . విటమిన్ సి, జింక్ , గార్లిక్ సప్లిమెంట్స్ తీసుకునే వారిలో ఎటువంటి మార్పులు కనిపించలేదు. జెండర్, వయసు, బరువు దృష్ట్యా చూసినప్పుడు ప్రోబయోటిక్స్, ఒమెగా 3, కొవ్వు ఆమ్లాలు, మల్టీ విటమిన్లు, విటమిన్ డి వంటివి అన్ని వయసులవారితోపాటు అధిక బరువు ఉన్న మహిళలలోనూ గమనించారు. ఇక పురుషులలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు.

Also Read: ఆక్సిజన్ సిలిండర్స్ పంపిస్తానన్న సుస్మితా సేన్.. నెటిజన్స్ ట్రోల్స్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన హీరోయిన్..

ఆక్సిజన్ సిలిండర్స్ పంపిస్తానన్న సుస్మితా సేన్.. నెటిజన్స్ ట్రోల్స్.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన హీరోయిన్..

తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలను చెప్పిన హీరోయిన్ ఇంద్రజ.. మతానికి మనసుకి నచ్చడానికి సంబంధం లేదంటూ..