PM meet : మహా విషాదం తప్పదు.. ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా నన్ను క్షమించాలి : సీఎం కేజ్రీవాల్
PM meet : కరోనా విలయంలో పరిస్థితులు చేయిదాటిపోతే, మహా విషాదం తప్పదన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. రాత్రంతా నిద్రపట్టడం లేదన్న ఆయన, ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా నన్ను క్షమించాలని ప్రధాని నరేంద్రమోదీని కోరారు.
Delhi CM Kejriwal : కరోనా విలయంలో పరిస్థితులు చేయిదాటిపోతే, మహా విషాదం తప్పదన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. రాత్రంతా నిద్రపట్టడం లేదన్న ఆయన, ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా నన్ను క్షమించాలని ప్రధాని నరేంద్రమోదీని కోరారు. కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఢిల్లీలో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని కేజ్రీవాల్ చెప్పారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన అత్యున్నత స్థాయి వర్చువల్ సమావేశంలో కేజ్రీవాల్ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత చాలా ఎక్కువగా ఉందని… పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధానిని కోరారు. పరిస్థితులు చేయిదాటిపోతే, మహా విషాదం తప్పదన్న ఆయన, ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి, రోగి కొనఊపిరితో ఉన్నప్పుడు.. ఆ పరిస్థితి గురించి తాను ఎవరితో మాట్లాడాలని ప్రధానిని నిలదీశారు. కొన్ని రాష్ట్రాలు ఆక్సిజన్ రవాణా వాహనాలను ఆపేస్తున్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. దేశంలోని ఆక్సిజన్ ప్లాంట్లను సైన్యం స్వాధీనం చేసుకోవాలని.. . కరోనా వ్యాక్సిన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన ధరకు అందజేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. కాగా, కోవిడ్ -19 సంక్రమణ తీవ్రంగా ఉన్న పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ కొంచెం సేపటి క్రితం నుంచి వర్చువల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌ఘడ్ , గుజరాత్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలను చెప్పిన హీరోయిన్ ఇంద్రజ.. మతానికి మనసుకి నచ్చడానికి సంబంధం లేదంటూ..