AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Crisis: అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ కీలక నిర్ణయం.. ఏం చేయబోతుందో తెలుసా?

Pakistan Political Crisis: పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు కుర్చీపై సంక్షోభ మేఘాల మధ్య తన స్టాండ్ మార్చుకున్నారు.

Pakistan Crisis: అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ కీలక నిర్ణయం.. ఏం చేయబోతుందో తెలుసా?
Imran Khan
Balaraju Goud
|

Updated on: Apr 02, 2022 | 7:09 PM

Share

Pakistan Political Crisis: పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఇప్పుడు కుర్చీపై సంక్షోభ మేఘాల మధ్య తన స్టాండ్ మార్చుకున్నారు. ఇప్పటి వరకు సొంత పార్టీ పీటీఐ(PTI Party) ఓటింగ్‌లో పాల్గొనకుండా తప్పించుకుంటూనే ఉంది. అయితే, ఇమ్రాన్ ఖాన్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన తరువాత, అతని పార్టీ ఇప్పుడు క్రాస్ సెక్షనల్ మూడ్‌లో పడింది. ఆఖరి బంతిని కూడా ఎదుర్కొంటానని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెబుతూ వస్తున్నారు. రేపు నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. మరోవైపు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో పాల్గొనాలని ఇమ్రాన్ పార్టీ నిర్ణయించింది.

పాకిస్తాన్ సైన్యం, ఇమ్రాన్ ప్రభుత్వానికి మధ్య విభేదాలు సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ హుస్సేన్ సంచలన ఆరోపణలు చేశారు. జాతీయ అసెంబ్లీలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇమ్రాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆజంఖాన్‌ ఆఫీస్‌లోని సామాన్లన్నింటినీ ఖాళీ చేయించారు. ఆఫీస్‌లోని అతని వస్తువులన్నీ ఇంటికి మార్చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

విపక్షాలు తనపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ‘ప్రతిష్ఠాన్’ తనకు మూడు ఆప్షన్‌లు ఇచ్చిందని, ‘రాజీనామా, అవిశ్వాస తీర్మానంపై ఓటు వేయండి లేదా ఎన్నికలపై ఓటు వేయండి’ అని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. అయితే ‘ప్రతిష్ఠాన్‌’ని ఏ దిశలో ప్రస్తావిస్తున్నారో ఆయన ముందుగా స్పష్టం చేయలేదు. పాకిస్తాన్ 73 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో, సగం కంటే ఎక్కువ సమయం పాటు శక్తివంతమైన సైన్యం దానిని పాలించింది. ఇప్పటివరకు, పాకిస్తాన్‌లో భద్రత, విదేశాంగ విధానానికి సంబంధించిన చాలా విషయాలలో సైన్యం పాలుపంచుకుంది.

Read Also…. Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వ్యాన్.. 11 మంది మృతి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్