Infosys: రష్యాలో కార్యాలయాన్ని మూసివేయనున్న ఇన్ఫోసిస్.. ప్రపంచ దేశాల ఒత్తిడే కారణమా..

దేశంలో అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్(Infosys) రష్యాలోని తన కార్యాలయాన్ని మూసివేస్తోంది...

Infosys: రష్యాలో కార్యాలయాన్ని మూసివేయనున్న ఇన్ఫోసిస్.. ప్రపంచ దేశాల ఒత్తిడే కారణమా..
Infosys
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Apr 02, 2022 | 4:45 PM

దేశంలో అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్(Infosys) రష్యాలోని తన కార్యాలయాన్ని మూసివేస్తోంది. బీబీసీ నివేదిక ప్రకారం ఉక్రెయిన్‌పై యుద్ధానికి ప్రతిస్పందనగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. రష్యాలో కార్యకలాపాలను మూసివేయాలని ఇన్ఫోసిస్‌పై ఒత్తిడి వస్తుందని నివేదిక పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా(Russia) దాడి కారణంగా చాలా పెద్ద వ్యాపారాలు దేశం విడిచి వెళ్లిపోయాయి. ఇన్ఫోసిస్ మాస్కో ఉద్యోగుల కోసం ప్రత్యమ్నాయాలను చూస్తోంది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దాడి తర్వాత చాలా దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. వోడ్కా నుంచి స్టీల్ వరకు అనేక వస్తువులపై బ్రిటన్ సుంకాలను పెంచింది. ఇది కాకుండా చాలా దేశాలు రష్యాకు విలాసవంతమైన వస్తువులను ఎగుమతి చేయడాన్ని కూడా నిషేధించాయి.

ఉక్రెయిన్‌పై రష్యా చేసిన యుద్ధం వేలాది మందిని చంపింది. 4.1 మిలియన్లకు పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చింది. ఇది కాకుండా, ఇన్ఫోసిస్ పెద్ద ఎత్తున ఉద్యోగులను రిక్రూట్ చేయబోతోంది. 2022-23 సంవత్సరంలో రికవరీ వేగవంతం అవుతుందని, రాబోయే కాలంలో వృద్ధికి ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనదని భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 55 వేల మందికి పైగా ఫ్రెషర్లకు అవకాశం కల్పించవచ్చని కంపెనీ సీఈవో సలీల్ పరేఖ్ తెలియజేశారు.

Read Also.. PAN Card Cheating: మోసపోయిన బాలీవుడ్‌ నటుడు.. తన పాన్‌ కార్డుతో ఎవరో లోన్‌ తీసుకున్నారంటూ ట్వీట్..