Crude Oil: ముడి చమురు సరఫరా పెంచుతామన్న IEA.. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయా..?
అత్యవసర నిల్వల నుంచి ముడి సరఫరా పెంచుతామని అంతర్జాతీయ ఇంధన సంస్థ IEA ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత ముడి చమురు(Crude Oil) ధర భారీగా పెరిగింది...
అత్యవసర నిల్వల నుంచి ముడి సరఫరా పెంచుతామని అంతర్జాతీయ ఇంధన సంస్థ IEA ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత ముడి చమురు(Crude Oil) ధర భారీగా పెరిగింది. ఈ ముడి చమురు ధరలను నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్ల కంటే పైనే ఉంది. గత నెలలో ధరలు బ్యారెల్‌కు 115 డాలర్ల కంటే పైనే పెరిగింది. ఈ వారం ప్రారంభంలో US తన వ్యూహాత్మక నిల్వల నుంచి వచ్చే 6 నెలల్లో ప్రతిరోజూ ఒక మిలియన్ బ్యారెల్స్ చమురును సరఫరా చేస్తామని ప్రకటించింది. IEA సభ్య దేశాల మంత్రుల సమావేశంలో సరఫరాను పెంచుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పారిస్‌కు చెందిన ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఏజెన్సీ సభ్య దేశాలు మార్కెట్‌లోకి ఎంత అదనపు చమురును విడుదల చేస్తారనే దానిపై ఏజెన్సీ సమాచారం అందించలేదు. ఏజెన్సీ ప్రకారం దీనిపై చర్చలు జరుగుతున్నాయి వచ్చే వారం దీనిపై స్పష్టం వచ్చే అవకాశం ఉంది. రష్యా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉంది. దాని ఉత్పత్తిలో 30 శాతం యూరప్‌కు, 20 శాతం చైనాకు పంపుతోంది. ఈ వారం ప్రారంభంలో అమెరికా తన చమురు నిల్వ నుంచి వచ్చే 6 నెలల్లో మార్కెట్‌లో 180 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ నిర్ణయం ప్రకారం, US ప్రభుత్వం వచ్చే 6 నెలల పాటు ప్రతిరోజూ 1 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరాను పెంచుతుంది. వ్యూహాత్మక నిల్వల నుంచి US చేసిన అతిపెద్ద విడుదల ఇది. ఈ సరఫరా రెండు రోజుల పాటు ప్రపంచం మొత్తం డిమాండ్‌కు సమానం. రాయిటర్స్ గోల్డ్‌మన్‌ను ఉటంకిస్తూ, ఈ సరఫరా చమురు మార్కెట్‌ను తిరిగి సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని, ఇది శాశ్వత పరిష్కారం కానప్పటికీ… ఈ కాలంలో ఒపెక్ దేశాలు తమ ఉత్పత్తిని పెంచుతాయని భావిస్తున్నారు.
Read Also.. Infosys: రష్యాలో కార్యాలయాన్ని మూసివేయనున్న ఇన్ఫోసిస్.. ప్రపంచ దేశాల ఒత్తిడే కారణమా..