Pak PM Imran Khan: ఆ ఫోన్ కోసమే పాకిస్తాన్ ప్రధాని ఎదురు చూపులు.. ఈ విరహ వేదన ఎంతకాలం

ఎన్నాళ్లీ ఎడబాటు.. ఎన్నాళ్లో ఈ విరహ వేదన.. ఎంతకాలం ఈ ఎదురుచూపు.. ఆరు నెలులు గడిచిపోయింది.. అందరితో మాట్లాడారు.. తనతో కనీసం మాట్లాడలేదు.. ఫోన్ కూడా చేయలేదు..

Pak PM Imran Khan: ఆ ఫోన్ కోసమే పాకిస్తాన్ ప్రధాని ఎదురు చూపులు.. ఈ విరహ వేదన ఎంతకాలం
Imran Khan
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 06, 2021 | 7:11 PM

ఎన్నాళ్లీ ఎడబాటు.. ఎన్నాళ్లో ఈ విరహ వేదన.. ఎంతకాలం ఈ ఎదురుచూపు.. ఆరు నెలులు గడిచిపోయింది.. అందరితో మాట్లాడారు.. తనతో కనీసం మాట్లాడలేదు.. ఫోన్ కూడా చేయలేదు.. ఇదంతా ప్రియురాలు.. ప్రియుడి కోసం పడుతున్న ఎడబాటు కాదు.. ఓ దేశ ప్రధాని.. ఓ దేశ అధ్యక్షుడి ఫోన్ కోసం ఎదురు చూపులు. అదేనండీ.. ప్రపంచ పెద్దన్న నుంచి ఫోన్ వస్తుందని పాకిస్తాన్ ప్రధాని గత కొన్ని రోజులుగా .. కాదు.. కాదు.. రోజులుగా కంటిమీద కునుకు తీయకుండా ఫోన్ రింగ్ కోసం ఎదిరి చూస్తున్నాడట.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు గడిచిపోయినా ఇంతవరకు పాకిస్తాన్ ప్రధానికి వ్యక్తిగతంగా మాట్లాడకపోవడంపై ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నాని అక్కడి మీడియా కోడై కూస్తోంది. భారత ప్రధాని మోదీతో పలు సందర్భాల్లో సంభాషించిన బైడెన్‌ నుంచి తనకు కనీస పలకరింపు లేకపోవడంతో ఇమ్రాన్‌ ఆవేదనతో రగిలిపోతున్నాడు. ఈ వివరాలను చెప్పింది ఎవరో అనమాకుడు అనుకుంటే పెద్ద పొరపాటు.. ఈ వివరాలను పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్‌ యూసఫ్‌ తెలిపాడు.

అఫ్గానిస్థాన్‌ వ్యవహారంలో ఎంతో కీలకమైనది పాకిస్తాన్. అటువంటి దేశ ప్రధాన మంత్రితో అమెరికా అధ్యక్షుడు ఇంత వరకు మాట్లాడలేదు. ఇది ఎటువంటి సంకేతాలనిస్తుందో అవగాహన చేసుకోవచ్చు. పాకిస్తాన్‌లో తాలిబన్లకు శిక్షణ కొనసాగుతోందని వార్తలు మీడియాను చుట్టేస్తుండటంతో ఆ దేశం వెన్నుల్లో వణుకు పుట్టిస్తోంది.

అంతే కాదు చైనాతో దోస్తీ కట్టిన పాకిస్తాన్ చెట్టపట్టాలు వేసుకుని తిరగడం అగ్రరాజ్యం దృష్టిలో పడింది. అమెరికా నాయకత్వం మమ్మల్ని ఇలాగే అశ్రద్ధ చేస్తుంటే మాకూ కొన్ని మార్గాలు ఉంటాయని మొయీద్‌ యూసఫ్‌ ‘ది ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ఆఫ్‌ లండన్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివరాలను పాకిస్తాన్‌కు చెందిన డాన్‌ పత్రిక ప్రచూరించింది.

‘అధ్యక్ష భవనం నుంచి ఫోన్‌ కాల్‌ వస్తుందని ఎప్పటికప్పుడు అమెరికా అధికారులు చెబుతున్నారు. అది సాంకేతిక సమస్యో మరోదో కానీ నమ్మశక్యం కావడం లేదు. ఫోన్‌ కాల్‌ రావడమే ప్రత్యేక సదుపాయం అయితే, రక్షణ బంధం కూడా ప్రత్యేక సదుపాయమే. పాకిస్తాన్‌కూ ప్రత్యామ్నాయాలు ఉంటాయని మొయీద్‌ యూసఫ్‌ సన్నాయి నొక్కులు నొక్కినట్లుగా పాకిస్తాన్ డాన్‌ రాసుకొచ్చింది.

‘అఫ్గానిస్థాన్‌ శాంతి ప్రక్రియలో ఇస్లామాబాద్‌కు కీలకమైన పాత్ర ఉందని అమెరికా అంగీకరిస్తుంది. తాలిబన్లను నిలువరించడానికి పాకిస్థాన్‌ సహాయాన్నీ కోరుతుంది. అయినా ఇమ్రాన్‌ ఖాన్‌తో బైడెన్‌ ఎందుకు మాట్లాడరు?’ అన్నది పాకిస్థాన్‌ వైపు నుంచి వస్తున్న ఫిర్యాదు.

చైనాతో పాకిస్థాన్‌ గట్టి సంబంధాలను కొనసాగించడం బైడెన్‌కు ఎంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. అయితే, అమెరికా అధికారులు మాత్రం.. బైడెన్‌ ఇంకా అనేక దేశాల నేతలతో మాట్లాడాల్సి ఉందని, త్వరలోనే ఇమ్రాన్‌ ఖాన్‌కూ ఫోన్‌ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

పాకిస్తాన్‌ ట్విట్టర్‌లో మీమ్స్, కామెడీ తెగ చక్కర్లు కొడుతున్నాయి.. ఇవి చూడండి…

మరికొన్ని ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి: పుట్టిన రోజైనా.. పెళ్లి రోజైనా.. తాగాల్సింది ఇదే.. ఆ రుచే వేరప్ప అంటున్న బీర్ ప్రియులు

RS Praveen Kumar: RS ప్రవీణ్‌కుమార్‌ పొలిటికల్ ఎంట్రీ.. నల్గొండ వేదికగా ఆ పార్టీలోకి..