పుట్టిన రోజైనా.. పెళ్లి రోజైనా.. తాగాల్సింది ఇదే.. ఆ రుచే వేరప్ప అంటున్న బీర్ ప్రియులు

International Beer Day 2021: పుట్టిన రోజైనా.. పెళ్లి రోజైనా.. సంతోషం.. విచారం.. కోపం.. దుఖం.. బాధ.. ఎమోషన్ ఏదైనా ముందు మందు కొట్టాల్సందే.. అందులోనూ యూత్‌కు చల్ల చల్లని పానియం బీర్‌ ఉండాల్సిందే. ఇదంతా ఎందుకంటే.. ఈ రోజు బీరు బాబుల రోజు.. అదేనండోయ్.. అంతర్జాతీయ బీర్ దినోత్సం.

పుట్టిన రోజైనా.. పెళ్లి రోజైనా.. తాగాల్సింది ఇదే.. ఆ రుచే వేరప్ప అంటున్న బీర్ ప్రియులు
Beer
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 06, 2021 | 6:20 PM

అంతర్జాతీయ బీర్ దినోత్సవాన్ని బీర్ ప్రియులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం ఆగస్టు 6 న ఇది 2007 సంవత్సరంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రారంభించబడింది. అటువంటి పరిస్థితిలో బీర్ కొన్ని వాస్తవాల గురించి మాకు తెలియచేస్తున్నాం. పుట్టిన రోజైనా.. పెళ్లి రోజైనా.. సంతోషం.. విచారం.. కోపం.. దుఖం.. బాధ.. ఎమోషన్ ఏదైనా ముందు మందు కొట్టాల్సందే.. అందులోనూ యూత్‌కు చల్ల చల్లని పానియం బీర్‌ ఉండాల్సిందే. అయితే బీర్ తాగాలంటే ఇవేవీ అవసరం లేవు. తమకు ఓ ప్రత్యేకమైన కారణం అవసరం లేదు. అనే బ్యాచ్ కూడా ఒకటుందండోయ్.. అయితే మద్యం తాగడంలో చాలా మంది ముందుగా ఎంపిక చేసుకునేంది మాత్రం బీర్. ఇతర ఆల్కహాల్ ఉత్పత్తుల వలె ఇది ప్రమాదకరం కొద్దిగా తక్కువే అంటున్నారు బీర్ ప్రియులు.. అంతేకాక, బీర్ ఆరోగ్యానికి మంచిదని కూడా ప్రచారం చేస్తున్నారు.

బీర్ తాగితే లాభాలు…

ఆల్కహాలిక్ ద్రాక్ష రసం, వైన్ కంటే బీర్లో ఎక్కువ ప్రోటీన్, విటమిన్ బి ఉంటుంది. బీర్‌లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి వివిధ వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. పలు అధ్యయనాల ప్రకారం.. బీర్ తాగడం గుండెకు సహాయపడటమే కాకుండా డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. 70,000 మందిపై ఇటీవల జరిపిన అధ్యయనంలో వారానికి 14 గ్లాసుల బీరు తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనవేత్తలు కనుగొన్నారు.

చల్లని బీరు అలా గొంతు నుంచి..

చల్లని బీరు అలా గొంతు నుంచి జరుకుంటే.. కడుపు చల్లగా ఉన్న ఫీలింగ్ వస్తుందట. అంతేకాదు.. బీరంటే నీళ్లేనని.. బీరు తాగితే నీళ్లు తాగినట్లేనని అనుకుంటారు బీరు బాబులు. వాస్తవానికి అది అపోహ మాత్రమే. వేసవిలో బీర్లు తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

మంచిదే కానీ..

క్లుప్తంగా చెప్పాలంటే బీరు తాగడం మీ ఆరోగ్యానికి మంచిదే. కానీ ఎక్కువగా తాగితే మాత్రం ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్టే అధ్యయనవేత్తలు చెబుతున్నారు. దాని వల్ల పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని వాళ్లు హెచ్చరిస్తున్నారు. ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Gold Funds: భారీ లాభాల కోసం ప్లాన్ చేస్తున్నారా.. పెట్టుబడి పెట్టడానికి ముందు ఇది తెలుసుకోండి..

RS Praveen Kumar: RS ప్రవీణ్‌కుమార్‌ పొలిటికల్ ఎంట్రీ.. నల్గొండ వేదికగా ఆ పార్టీలోకి..