Drinking Water: బీకేర్‌పుల్.. ఈ మూడు సమయాల్లో మంచినీరు తాగకూడదు!! ఇవి తెలుసుకోండి..
ఎక్కువగా నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. డాక్టర్లు కూడా ఇదే సిఫార్సు చేస్తుంటారు. అయితే ఆరోగ్యానికి ప్రయోజనకరం అని చెప్పి..
ఎక్కువగా నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. డాక్టర్లు కూడా ఇదే సిఫార్సు చేస్తుంటారు. అయితే ఆరోగ్యానికి ప్రయోజనకరం అని చెప్పి.. అధిక మోతాదులో నీళ్లు తాగితే లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. అసలు నీరు ఎప్పుడెప్పుడు తాగాలి.. ఫుడ్‌తో మంచి నీరు తాగడం వల్ల కలిగే ప్రభావాలు ఏంటి.? అనే విషయాలను తెలుసుకుందాం..
నిద్రపోవడానికి ముందు…
నిద్రపోయే ముందు తగినంత నీరు తాగకూడదని చాలామంది వైద్య నిపుణులు చెబుతుంటారు. దీని వెనుక రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, అది మీ నిద్రను ప్రభావితం చేస్తుంది, తరచూ టాయిలెట్‌కు వెళ్ళాల్సి ఉంటుంది. రెండోది.. రాత్రిపూట మీ మూత్రపిండాలు పనితీరు చాలా నెమ్మదిగా ఉంటుంది. దాని వల్ల ముఖం మీద వాపు వచ్చే అవకాశం ఉంటుంది.
తినడానికి ముందు.. ఆ తర్వాత..
ఆహారం తినడానికి అరగంట ముందు.. తిన్నాక అరగంట వరకు నీరు తాగకూడదని డాక్టర్లు చెబుతుంటారు. ఒకవేళ నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుందని అంటారు. కొన్ని పరిశోధనల్లో కూడా తేలింది. భోజనం తీసుకున్న తర్వాత కొద్దిసేపటికి మంచినీరు తాగితే జీర్ణవ్యవస్థ సరిగ్గా పని చేస్తుందని అంటుంటారు. అందువల్ల భోజనం చేసిన తర్వాత కొద్దిసేపటికి మంచినీరు తాగాలని డాక్టర్లు అంటారు.
వ్యాయామాల మధ్య నీరు తాగవద్దు..
మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు మంచినీరు తాగకూడదని వైద్యులు చెబుతారు. ఎక్సర్‌సైజులు చేసే సమయంలో శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. ఆ టైంలో నీరు త్రాగడం వల్ల మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. తలనొప్పితో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే వ్యాయామం పూర్తయిన తర్వాత కొద్దిసేపటికి నీరు తాగాలని డాక్టర్లు చెబుతారు.
ఆహారం తీసుకునేటప్పుడు నీరు తాగడం తప్పా?
భోజనానికి అరగంట ముందు.. అరగంట తర్వాత వరకు నీరు తాగరాదని వైద్యులు తరచూ చెబుతుంటారు. మీరు ఆహారంతో పాటుగా నీరు త్రాగితే, అది నోటిలోని లాలాజలం ఉత్పత్తిని నిలిపివేస్తుంది. తద్వారా జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. దీనితో పాటుగా ఆహార పోషకాలు కూడా సరిగ్గా అందవు. అదే సమయంలో, భోజనంతో పాటు నీరు తాగడం వల్ల యాసిడిటీ సమస్యలు వస్తాయని పలువురు అంటుంటారు. అలాగే బరువు పెరిగే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఇలా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. అయితే ఇవన్నీ వట్టి పుకార్లేనని తాజా అధ్యయనం తేల్చేసింది.
ఆహారంతో నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని కొన్ని పరిశోధనలు మాత్రమే స్పష్టం చేస్తున్నాయని.. మీరు ఎలాంటి సందేహాలు లేకుండా ఫుడ్‌తో పాటు మంచినీరు కూడా తాగవచ్చునని యూఎస్ పరిశోధకులు స్పష్టం చేశారు. అమెరికన్ కాలేజీ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మిచెల్ పిక్కో మాట్లాడుతూ ”ఆహారంతో పాటు నీరు తాగొచ్చని.. జీర్ణక్రియలో ఎలాంటి సమస్య ఉండదని తెలిపారు.
Also Read:
మొసలికి చిక్కిన అడవి దున్న.. కట్ చేస్తే సీన్ రివెర్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
బ్రతుకున్న పామును కరకరా నమిలి మింగేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకే.!
10 వేలకుపైగా పరుగులు, 1697 వికెట్లు.. ఈ దిగ్గజ క్రికెటర్ మామూలోడు కాదు.. అతడెవరో తెలుసా!