Immunity In Monsoon: కోవిడ్, సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టేందుకు తులసి, పసుపు పానీయం.. ఎలా తయారు చేసుకోవాలంటే
Immunity In Monsoon: ఓ వైపు కరోనా వైరస్ సెకండ్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ లోకి అడుగు పెడుతున్నాం.. తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్న వైద్య సిబ్బంది..మరోవైపు వర్షాకాలంలో..
Immunity In Monsoon: ఓ వైపు కరోనా వైరస్ సెకండ్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ లోకి అడుగు పెడుతున్నాం.. తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్న వైద్య సిబ్బంది..మరోవైపు వర్షాకాలంలో విజృంభించే సీజనల్ వ్యాధులు.. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవవుతున్నారు. ఈ క్లిష్ట సమస్యను ఎదుర్కోవడానికి..సులభంగా బయటపడడానికి ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి.
ఎందుకంటే కోవిడ్ మహమ్మారే కాదు.. వర్షాకాలంలో సూక్ష్మక్రిముల ద్వారా వచ్చే వ్యాధులు కూడా ఎక్కువగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి సోకుతాయి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు ఈజీగా వ్యాధుల బారిన పడతారు..కనుక రోజు తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుని పౌష్టికాహారం తీసుకోలేని .. ఈ సీజనల్ లో బయట ఫుడ్ ను తినడం మానుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు.. పసుపు, తులసిలను కలిసి చేసిన మిశ్రమం ఈ సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. తులసి పసుపు మిశ్రమం రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉండడానికి.. గొంతులో నొప్పి, జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. తులసి, పసుపు పానీయం తయారీ.. అది ఇచ్చే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
తులసి, పసుపు పానీయం తయారీకి కావాల్సిన పదార్ధాలు:
పసుపు-అర టీస్పూన్ తులసి ఆకులు-8 నుంచి 12 టేబుల్ స్పూన్లు తేనె- 3 స్పూన్లు లవంగాలు-4 దాల్చిన చెక్క-చిన్న ముక్క
పానీయం తయారీ విధానం:
స్టౌ మీద ఒక దళసరి గిన్నె పెట్టి.. ఒక గ్లాసు నీరు పోయాలి.. అనంతరం ఆ నీటిలో పసుపు, తులసి ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుని ఆ నీటిని 15 నిమిషాల పాటు మరిగించండి. బాగా మరిగిన తర్వాత ఆ నీటిని ఫిల్టర్ చేసుకుని గోరు వెచ్చగా ఐన తర్వాత తులసి, పసుపు పానీయంలో తేనెను కలుపుని తాగండి. ఈ వాటర్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు.. సీజనల్ వ్యాధులైన జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల బారినుంచి కాపాడుతుంది. అయితే ఈ తులసి, పసుపు పానీయాన్ని రోజుకు రెండు సార్లు తాగాలి.
ఆరోగ్య ప్రయోజనాలు
– డయాబెటిక్ పేషెంట్లు ఈ పానీయం తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. – శరీరంలోని టాక్సిన్‌లను తొలగించి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది – మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఈ పానీయం దివ్య ఔషధం – జలుబు , గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
Also Read: Tokyo Olympics 2021: టోక్యోలో రేపు వర్షం వస్తే.. భారత్ ఖాతాలో మరో రజతం ఖాయం.. లేదంటే..