Proteins: ప్రోటీన్ల కోసం గుడ్లు, నాన్-వెజ్‌ తింటున్నారా.. అవసరం లేదండీ.. వీటిలో కూడా కావల్సినన్ని ప్రోటీన్లు ఉన్నాయండోయ్..

ప్రోటీన్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరి ఆహారంలో ప్రోటీన్ తప్పకుండా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాల్లో గుడ్లు ముఖ్యమైనవి.

Proteins: ప్రోటీన్ల కోసం గుడ్లు, నాన్-వెజ్‌ తింటున్నారా.. అవసరం లేదండీ.. వీటిలో కూడా కావల్సినన్ని ప్రోటీన్లు ఉన్నాయండోయ్..
Protein In Vegetarian
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 06, 2021 | 9:20 PM

మా శరీరంలో కణజాలాలను పునరుత్పత్తికి ప్రోటీన్ దోహదపడుతాయి. అలాగే ఎముకలు, కండరాలు, మృదులాస్థితోపాటు చర్మం ఏర్పడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన జుట్టు, గోర్లు ఏర్పడటంలో కూడా ప్రోటీన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. శరీరానికి శక్తిని అందించడానికి ప్రోటీన్ పనిచేస్తుంది. శరీరానికి ప్రోటీన్ అవసరమని భావించడానికి ఇదే కారణం. కానీ చాలా మంది గుడ్లు, నాన్-వెజ్ నుండి మాత్రమే సమృద్ధిగా ప్రోటీన్ లభిస్తాయని నమ్ముతారు. గుడ్లు, నాన్-వెజ్‌లో మాత్రమే ప్రోటీన్లు ఉంటాయనుకుంటే పొరపాటే.. శాఖాహారాల్లో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కానీ అందులో పూర్తి నిజం లేదు. శాఖాహారంలో తగినంత ప్రోటీన్లు ఉండవని మీరు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. శాకాహారంలో కూడా అనేక ప్రోటీన్లు ఉన్నాయి. వీటిని ప్రోటీన్లకు ఉత్తమ వనరుగా పరిగణిస్తారు. అటువంటి 6 ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

వేరుశెనగ..

అర కప్పు వేరుశెనగలో 20 గ్రాముల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటాయి. ఇది కాకుండా అనేక ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు వేరుశెనగలో ఉంటాయి. ఒక వ్యక్తి అర కప్పు వేరుశెనగను క్రమం తప్పకుండా తింటుంటే.. అతని శరీరంలో ప్రోటీన్ లోపం చాలా వరకు తీరుతుంది. మీరు వేరుశెనగను నానబెట్టి తినవచ్చు లేదా ఏదైనా వేసుకోవచ్చు. ఇది కాకుండా.. మీరు వేరుశెనగ వెన్న ద్వారా శరీర ప్రోటీన్ లేకపోవడాన్ని కూడా తీర్చవచ్చు.

పప్పులు.. 

వివిధ రకాల పప్పుల్లో భారీగా ప్రోటీన్లే ఉంటాయి. ప్రోటీన్‌కు పప్పులు బ్యాంకుగా.. మంచి వనరుగా పరిగణించబడతాయి. ఒక గిన్నె పప్పులో 18 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. మీరు నిజంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే.. రోజువారీ ఆహారంలో కనీసం ఒక గిన్నె పప్పులను తప్పనిసరిగా చేర్చండి.

బాదం..

బాదం కూడా ప్రోటీన్ ఉత్తమ వనరుగా పరిగణించబడుతుంది. అర కప్పు బాదంలో దాదాపు 17 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. మీకు కావాలంటే.. నానబెట్టిన బాదం పొట్టు తీసి తినవచ్చు. బాదం పొడిని వెన్నతో కలుపుకుని తినవచ్చు. మీరు శరీరంలో ప్రోటీన్ లోటును ఇలా తీర్చుకోవచ్చు.

సోయా పనీర్ (టోఫు)

సోయా పాలతో తయారు చేసిన పనీర్‌ను టోఫు అంటారు. 90 గ్రాముల టోఫులో సుమారు 9-10 గ్రాముల ప్రోటీన్ కనిపిస్తుంది. మీరు టోఫు తినలేకపోతే.. దీనికి బదులుగా సోయాబీన్స్ తినవచ్చు. 100 గ్రాముల సోయాబీన్ ధాన్యాలలో దాదాపు 36 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. సోయా చిక్కుడుతో తయారు చేసిన సోయా ముక్కలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని కూడా తినవచ్చు.

శనగపప్పు (Chane ki daal)

శనగపప్పును ప్రోటీన్ల మూలంగా పరిగణించబడతాయి. అర కప్పు శనగ పప్పు నుంచి సుమారు 8 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. కరోనా వ్యాప్తి సమయంలో ప్రతి రోజు మొలకెత్తిన శనగలను తీసుకోవచ్చు. లేదా.. నానబెట్టిన పప్పు, ఉడకబెట్టిన పప్పు తినవచ్చు.

రాజ్‌గిరా..

రాజ్‌గిరా కూడా ప్రోటీన్‌కు మంచి మూలం. మీరు చేసుకునే చపాతీ పిండిలో  రాజ్ గిరా పిండిని కలపండి. ఒక కప్పు రాజ్‌గిరాలో దాదాపు 10 గ్రాముల ప్రోటీన్ కనిపిస్తుంది. ఇది ప్రోటీన్ అధికంగా ఉంటుంది అలాగే గ్లూటెన్ రహితమైనది. మీకు కావాలంటే రోటీలను తయారు చేసిన తర్వాత సాధారణ పిండిలో కలిపి తినవచ్చు.

ఇవి కూడా చదవండి: Pak PM Imran Khan: ఆ ఫోన్ కోసమే పాకిస్తాన్ ప్రధాని ఎదురు చూపులు.. ఈ విరహ వేదన ఎంతకాలం

పుట్టిన రోజైనా.. పెళ్లి రోజైనా.. తాగాల్సింది ఇదే.. ఆ రుచే వేరప్ప అంటున్న బీర్ ప్రియులు