Library Book: 50 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగొచ్చిన పుస్తకం.. గొప్ప సందేశమిచ్చిన కథనం
ఒక్కోసారి కొన్ని విషయాలు నమ్మశక్యంగా కనిపించవు. అదేవిధంగా విచిత్రంగానూ అనిపిస్తాయి. కానీ అటువంటి విషయాలు చాలా అరుదుగా వెలుగులోకి వస్తాయి. అటువంటిదే ఇదికూడా.
Library Book: ఒక్కోసారి కొన్ని విషయాలు నమ్మశక్యంగా కనిపించవు. అదేవిధంగా విచిత్రంగానూ అనిపిస్తాయి. కానీ అటువంటి విషయాలు చాలా అరుదుగా వెలుగులోకి వస్తాయి. అటువంటిదే ఇదికూడా. ఒక గ్రంథాలయం నుంచి తీసుకున్న పుస్తకాన్ని ఏభై ఏళ్ల తరువాత తిరిగి పెనాల్టీతో మళ్ళీ ఇచ్చిన సంఘటన జరిగింది. ఈ సంఘటన ఈశాన్య పెన్సిల్వేనియాలోని ప్లైమౌత్, పా లైబ్రరీలో జరిగింది. బర్టన్ హాబ్సన్ రాసిన “కాయిన్స్ యు కెన్ కలెక్ట్” అనే పుస్తకం 1967కు చెందిన కాపీ గత నేలలో 20 డాలర్ల బిల్లుతో సహా లైబ్రరీకి చేరినట్టు విల్కేస్-బారే సిటిజన్స్ వాయిస్ వెల్లడించింది.
ఈ పుస్తకంతో పాటు ఒక సంతకం లేని లేఖ కూడా చేరింది. అందులో యాభై సంవత్సరాల క్రితం (అవును 50!), ఒక చిన్న అమ్మాయి 1971 లో ఈ లైబ్రరీ నుండి ఆ పుస్తకాన్ని తీసుకున్నట్టు ఉంది. అయితే, ఆ తరువాత ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను ఆ ఊరి (ప్లైమౌత్) నుంచి వేరే ఊరికి తీసుకువెళ్లిపోయారు. వారు ఊరు మారుతున్న విషయం ఆమెకు తెలీదు. అప్పట్లో పిల్లలకు అటువంటి విషయాలు చెప్పేవారు కాదు.
చాలాసార్లు ఆ పుస్తకాన్ని తిరిగి పంపించాలని అనుకుంది కానీ, ఎప్పటికప్పుడు ఎదో ఇబ్బందితో పంపించలేకపోయింది. ఇది ఆమె కుటుంబంలో పెద్ద జోక్ లా మారిపోయింది వాళ్ళు ఊరు లేదా ఇల్లు మారిన ప్రతిసారి ఇంట్లో అందరూ నీ ‘ప్లైమౌత్ బుక్’ ప్యాక్ చేశావా అని అడిగేవారట.
తాను పంపించిన ఈ 20 డాలర్ల జరిమానా సరిపడేది కాదని తనకు తెలుసనీ, దానిని కొంత మంది పిల్లలకి జరిమానాలు చెల్లించడానికి ఉపయోగించవచ్చని చెప్పింది. ఇంత చెప్పిన ఆమె తన పేరు చెప్పలేదు. లైబ్రరీ రికార్డులలోనూ ఆమె పేరు తెలియలేదు.
త్వరలో ఆ పుస్తకం.. లేఖ రెండిటినీ లైబ్రరీలో ప్రదర్శనకు ఉంచబోతున్నారు. స్థానిక అవార్తా పత్రికలలో ఈ విషయాన్ని ప్రకటిస్తే.. ఈ లేఖ రాసిన ఆమె ఆచూకీ తెలిసే అవకాశము ఉందని భావిస్తున్నా.. ఆపని చేయడానికి కూడా లైబ్రరీ వర్గాలు నిరాకరిస్తున్నాయి. ఆమె తానూ రహస్యంగా ఉండిపోవాలని అనుకుంది. నిజాయతీగా ఇన్నేళ్ల తర్వాత తాను పుస్తకాన్ని తిరిగి పంపించింది. అటువంటి వ్యక్తి కోరిక మన్నించాల్సిన అవసరం ఉందనేది లైబ్రరీ వర్గాల వారి ఆలోచన.
Also Read: PMFBY Quiz Contest : ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన క్విజ్ పోటీలో పాల్గొనండి.. రూ.11000 గెలుచుకోండి..
“మాతృత్వంలోని మాధుర్యం తెలుసుకోవాలని ఉంది.. నా భర్తకు బెయిల్ ఇవ్వండి..” హైకోర్టులో మహిళ పిటిషన్