Pakistan Floods: పాక్‌లో అంటువ్యాధుల అల్లకల్లోలం.. ఒక్క రోజే ఆస్పత్రులకు 90 వేల మంది.. ప్రమాదంలో 34లక్షల మంది చిన్నారులు
సింధ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సెంటర్ లో గురువారం 92,797 మంది పౌరులు చికిత్స పొందారని పేర్కొన్నారు. గురువారం నాడు 28 డెంగ్యూ కేసులతో పాటు 17,977 డయేరియా కేసులు, 20,064 చర్మవ్యాధులు నమోదయ్యాయి.
Pakistan Floods: పాకిస్థాన్ లో గతంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల వలన బాధిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా సింధ్‌లోని వరద బాధిత ప్రాంతాల్లో ఒక రోజులో 90,000 మందికి పైగా ప్రజలు వ్యాధి బారిన పడ్డారు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల బారిన పడి చికిత్స పొందుతున్నారు. వరదల కారణంగా మృతుల సంఖ్య 1500 దాటినట్లు సమాచారం. పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం.. 30 ఏళ్ల తరువాత రికార్డ్ స్థాయిలో వర్షాలు కురిశాయి. వరదలు బీభత్సం సృష్టించాయి. 1,545 మంది మరణించారు. 12,850 మంది గాయపడ్డారు.
డాన్ పత్రిక శుక్రవారం విడుదల చేసిన నివేదికలో.. సింధ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సెంటర్ లో గురువారం 92,797 మంది పౌరులు చికిత్స పొందారని పేర్కొన్నారు. గురువారం నాడు 28 డెంగ్యూ కేసులతో పాటు 17,977 డయేరియా కేసులు, 20,064 చర్మవ్యాధులు నమోదయ్యాయి. జులై నుంచి ముంపు మండలంలో ఏర్పాటు చేసిన క్షేత్ర, సంచార వైద్యశాలల్లో మొత్తం 23 లక్షల మంది రోగులు చికిత్స పొందుతున్నారు.
గత 24 గంటల్లో 22 మంది మరణం: గత 24 గంటల్లో వరదల కారణంగా 22 మంది మరణించారని.. జూన్ 14 నుంచి ఇప్పటి వరకు 1,508 మంది మరణించారని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఎంఎ) వెల్లడించింది. NDMA నివేదికలో.. వరద సంబంధిత సంఘటనలలో 24 గంటల్లో తొమ్మిది మంది గాయపడ్డారని దీంతో ఇప్పటి వరకూ మొత్తం 12,758 మంది గాయపడ్డారని డాన్ నివేదించింది. రుతుపవనాల వలన కురిసిన వర్షాల కారణంగా పాకిస్థాన్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వర్షాలు, వరదల కారణంగా గృహాలు, వాహనాలు, పంటలు నాశనం అయ్యాయి. భారీగా పశువులు మృతి చెందాయి. ఇప్పటి వరకూ US$30 బిలియన్ల నష్టం వాటిల్లిందని అంచనా.
దాదాపు 1.6 కోట్ల మంది చిన్నారుల జీవితాలపై ప్రభావం: ఐక్యరాజ్యసమితి ప్రకారం పాకిస్తాన్‌లో తీవ్రమైన వరదల కారణంగా సుమారు 16 మిలియన్ల మంది పిల్లల జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బాధిత చిన్నారుల్లో కనీసం 34 లక్షల మంది పిల్లలకు తక్షణ సహాయం అవసరం. పాకిస్థాన్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు డయేరియా, డెంగ్యూ జ్వరం, చర్మ వ్యాధులతో బాధపడుతున్నారని UN ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (UNICEF) ప్రతినిధి అబ్దుల్లా ఫాదిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
528 మంది చిన్నారులు మృతి: వరదల కారణంగా కనీసం 528 మంది చిన్నారులు మరణించారని సింధ్ ప్రావిన్స్‌లోని వరద బాధిత ప్రాంతాలకు రెండు రోజుల పర్యటన తర్వాత అబ్దుల్లా ఫాదిల్ ఒక ప్రకటనలో తెలిపారు.
పాములు, తేళ్లు కాటేస్తాయనే భయం వరదల కారణంగా తాగునీరు, ఆహారం, కుటుంబ జీవనోపాధి కోల్పోవడంతో పాటు కొత్త ప్రమాదాలను బాధితులు ఎదుర్కొంటున్నారు. వరద బాధితులు తమ చిన్న పిల్లలతో కలిసి బహిర్భూమిలో బతకాల్సి వస్తోంది. దెబ్బతిన్న భవనాలు, వరద నీటి మధ్య ఉండటం వల్ల పాములు, తేళ్లు వంటి విషసర్పాల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. వేలాది పాఠశాలలు, నీటి పంపిణీ వ్యవస్థలు, ఆసుపత్రులు వంటి మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. దేశంలో వరదల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. పాకిస్తాన్‌లో వరద విపత్తు తీవ్రత పెరుగుతుండటంతో, అంతర్జాతీయంగా పాకిస్థాన్ కు సహాయం చేస్తున్నాయి.
పాకిస్థాన్‌కు సాయం చేస్తున్న దేశాలు: UNICEF ప్రతినిధి మాట్లాడుతూ.. విచారకరమైన వాస్తవమేమిటంటే. పాకిస్థాన్ కు చేసే సహాయాన్ని భారీగా పెంచకపోతే.. చాలా మంది పిల్లలు తమ ప్రాణాలను కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేసింది. చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతూ తమ పిల్లలకు కడుపునిండా తిండి పెట్టలేకపోతున్నారు. తల్లిల్లు అనారోగ్యంతో ఉన్నారు.. దీంతో పిల్లలకు పాలు ఇవ్వడం లేదు. వరదల్లో గల్లంతైన చిన్నారుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. UNICEF వరద బాధితులను ప్రమాదాల నుండి వారిని రక్షించడానికి అన్ని విధాలుగా చేస్తోంది. జపాన్ ప్రభుత్వం వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కోవటానికి పాకిస్తాన్‌కు 7 మిలియన్ US డాలర్లను ఇచ్చింది. డాలర్ల అత్యవసర మంజూరు ప్రకటించారు. అదే సమయంలో, కెనడియన్ ప్రభుత్వం 12 స్వచ్ఛంద సంస్థల ద్వారా 3 మిలియన్ కెనడియన్ డాలర్లను ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..