Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

North Korea: న్యూ ఇయర్‌లో ‘నియంత కిమ్’ సరికొత్త నిర్ణయం.. నమ్మండి ఇక ఫోకస్ దానిమీదేనట..

North Korea: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కొత్త సంవత్సరంలో సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలా కాకుండా ఇక నుంచి ఉత్తర కొరియా దేశం..

North Korea: న్యూ ఇయర్‌లో 'నియంత కిమ్' సరికొత్త నిర్ణయం.. నమ్మండి ఇక ఫోకస్ దానిమీదేనట..
Kim Jong Un
Follow us
Surya Kala

|

Updated on: Jan 01, 2022 | 4:27 PM

North Korea: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కొత్త సంవత్సరంలో సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలా కాకుండా ఇక నుంచి ఉత్తర కొరియా దేశం ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నట్లు ఆ దేశాధినేత ప్రకటించినట్లు తెలుస్తోంది. దేశంలో ఉపాధి కల్పించేలా పరిశ్రమల నెలకొల్పుతామని.. కిమ్ జోంగ్ ప్రకటించినట్లు శనివారం ఆ దేశ మీడియా పేర్కొంది. కొరియా వర్కర్స్ పార్టీ (డబ్ల్యూపీకే) 8వ సెంట్రల్ కమిటీ నాల్గవ సమావేశం ముగింపు సందర్భంగా కిమ్ జోంగ్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించినట్లు తెలిపింది. ఈ సమావేశం సోమవారం ప్రారంభమైంది.

కొత్త ఏడాది 2022:

కొత్త ఏడాది 2022లో ఉత్తర కొరియా ప్రధాన లక్ష్యం ఆర్థికాభివృద్ధిని సాధించడమని.. ఇప్పటికే దేశం జీవన్మరణ పోరాటాన్ని ఎదుర్కొంటున్నందున.. ప్రజల జీవితాలను మెరుగుపరచడం తన ప్రధమ కర్తవ్యమని కిమ్ జోంగ్ అన్నారు. 2011లో తన తండ్రి మరణించిన అనంతరం కిమ్ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.  ప్రస్తుతం కిమ్ పదవీ కాలం చేపట్టి  10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. దేశ ప్రజల ఆర్ధికాభివృద్ది కోసం ‘పంచవర్ష ప్రణాళిక అమలు చేయనున్నామని.. దేశాభివృద్ధి,  ప్రజల జీవితాల్లో విశేషమైన మార్పు తీసుకురావడానికి  ఖచ్చితమైన ప్రణాళికలు చేపట్టడం తమ ప్రాథమిక పని అని చెప్పారు.

కిమ్ జోంగ్ దేశీయ సమస్యల గురించి ప్రస్తావిస్తూ..  సాధారణంగా..  కిమ్ జోంగ్ కొత్త సంవత్సరం సందర్భంగా చేసే ప్రసంగానికి విరుద్ధంగా ఈ ఏడాది ప్రసంగం ఉంది. కిమ్  ఈసారి తన ప్రసంగంలో దేశీయ సమస్యలకు (కిమ్ జోంగ్ ఉన్ న్యూస్) ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామాభివృద్ధికి ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలు, ప్రజల ఆహారం, పాఠశాల, విద్యార్థుల చదువు గురించి ప్రస్తావించారు. అంతేకాదు అభివృద్ధి చెందాలంటే.. ‘సోషలిస్టు పద్ధతులను’ అరికట్టాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. దీంతో ఈ ఏడాది కిమ్ జోంగ్  ప్రసంగం విభిన్నంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే కొత్త ఏడాది గురించి మాట్లాడుతూ.. కిమ్ ప్రపంచ వ్యవహారాల గురించి ప్రస్తావించలేదు.. సైన్యం లేదా ఆయుధాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు.

సైనికులు విధేయత చూపాలని కోరిన కిమ్:  ఉత్తర కొరియా సైన్యానికి సుప్రీం కమాండర్ అయిన కిమ్ జోంగ్ ఉన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా..  తన 1.2 మిలియన్ల సైనికులను ప్రస్తావిస్తూ.. వారు తనకు బలం కావాలని కోరారు. సైనికులు ఉత్తర కొరియాని రక్షించాలని కోరారు. కోవిడ్-19 మహమ్మారి, UN ఆంక్షలు, అన్వయుధాల దుర్వినియోగం కారణంగా ఉత్తర కొరియా అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో దేశంలో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశంలో ఆకలి చావులాంటి పరిస్థితి ఏర్పడింది.

Also Read :   కడియం నర్సరీలో అందాలపూబాలతో కొత్త ఏడాదికి సరికొత్తగా స్వాగతం.. ఆహుతులను ఆకట్టుకుంటున్న వైనం..