India – Pakistan: అణ్వాయుధాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్న దయాది దేశాలు భారత్-పాక్.. ఈ రోజే ఎందుకో తెలుసా..!
India, Pakistan exchange lists of nuclear installations: ఢిల్లీ, ఇస్లామాబాద్‌లలోని భారత్, పాకిస్తాన్ దౌత్యవేత్తలు తమ దేశాల అణు వ్యవస్థాపనలు, సదుపాయాల జాబితాను పరస్పరం
India, Pakistan exchange lists of nuclear installations: ఢిల్లీ, ఇస్లామాబాద్‌లలోని భారత్, పాకిస్తాన్ దౌత్యవేత్తలు తమ దేశాల అణు వ్యవస్థాపనలు, సదుపాయాల జాబితాను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం శనివారం ఏకకాలంలో అణు స్థావరాల జాబితాను ఇరు దేశాలు పరస్పరం మార్చుకున్నట్లు విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అణు కేంద్రాలపై పరస్పర దాడులను నిషేధించేందుకు చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఈ కార్యక్రమం జరిగినట్లు వెల్లడించింది.
ఈ ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం.. భారతదేశం, పాకిస్తాన్ రెండూ ఒకరికొకరు అణు కేంద్రాలపై దాడి చేయకుండా నిషేధించే ప్రయత్నంలో భాగంగా అణు సంస్థాపనలు, సౌకర్యాల గురించి పరస్పరం తెలియజేసుకుంటాయి. అణు సంస్థాపనలు, సౌకర్యాల జాబితాను న్యూ ఢిల్లీ, ఇస్లామాబాద్‌లో ఏకకాలంలో దౌత్య మార్గాల ద్వారా జరిగినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఇది ప్రతీఏటా జనవరి 1నే జరుగుతుంది. గత మూడు దశబ్దాల నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతోంది.
1988 డిసెంబర్ 31న భారత్, పాకిస్తాన్ అణు స్థాపనలు, సౌకర్యాలపై దాడి నిషేధం ఒప్పందం మీద సంతకం చేశాయి. ఇది 1991 జనవరి 27 నుంచి అమలులోకి వచ్చింది. 31 ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం, భారతదేశం, పాకిస్తాన్ ప్రతి జనవరి మొదటి తేదీన ఒప్పందం పరిధిలోకి వచ్చే అణు సంస్థాపనలు, సౌకర్యాల గురించి పరస్పరం తెలియజేసుకుంటాయి.
Also Read: