PM Narendra Modi: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ.. రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నగదు జమ..

PM Narendra Modi: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ.. రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నగదు జమ..
Pm Modi

PM Kisan Smman Nidhi: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) 10వ విడతను ప్రధాని నరేంద్రమోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. 10 కోట్లకు పైగా

Shaik Madarsaheb

|

Jan 01, 2022 | 4:41 PM

PM Kisan Smman Nidhi: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) 10వ విడతను ప్రధాని నరేంద్రమోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. 10 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు 20,000 కోట్లకు పైగా నగదు మొత్తాన్ని బదిలీ చేశారు. దీనితోపాటు, దాదాపు 351 రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు 14 కోట్లకు పైగా ఈక్విటీ గ్రాంట్ కూడా విడుదల చేశారు. ఇది 1.24 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మాట్లాడుతూ.. నేడు మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 8 శాతానికి పైగా ఉందన్నారు. భారత్‌కు రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. మన విదేశీ మారకద్రవ్య నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని, జీఎస్టీ వసూళ్లలో పాత రికార్డులు కూడా తిరగరాసినట్లు ప్రధాని అన్నారు. ఎగుమతులు, ముఖ్యంగా వ్యవసాయంలో కూడా కొత్త రికార్డులను నెలకల్పినట్లు వివరించారు. దేశం కోసం ఎంతోమంది తమ జీవితాన్ని ధారపోసి నవ భారతాన్ని నిర్మిస్తున్నారన్నారు. దేశ అభివృద్ధికి కొత్త శక్తి వస్తున్నట్లు తెలిపారు.

ఎగుమ‌తుల విష‌యంలో కొత్త అంచ‌నాలు చేరుకున్నామ‌న్నారు. 2021లో దేశంలో యూపీఐ పద్దతి ద్వారా 70 లక్షల కోట్ల లావాదేవీలు జ‌రిగాయ‌ని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో సుమారు 50 వేల‌కు పైగా స్టార్టప్‌లు ఆవిర్భవించినట్లు తెలిపారు. గత 6 నెలల్లో 10,000కు పైగా స్టార్టప్‌లు ఏర్పడ్డాయని.. 2022 సంవత్సరంలో వీటిని వేగవంతం చేయాలని తెలిపారు. వాతావ‌ర‌ణ మార్పుల‌పై పోరాటాన్ని కొసాగిస్తున్నామ‌ని, 2070 నాటికి కార్బన్ ఉద్ఘరాల విడుద‌ల జీరోకు తీసుకురానున్నట్లు ప్రధాని వివరించారు. హైడ్రోజన్, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై ప్రత్యేకంగా ఉత్పత్తిపై దృష్టి పెట్టిన‌ట్లు ప్రధాని వివరించారు. అబ్బాయిల‌తో స‌మానంగా యువతుల వివాహ వ‌య‌స్సు18 నుంచి 21 ఏళ్లకు పెంచిన‌ట్లు తెలిపారు. గ‌తిశ‌క్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌తో మౌలిక‌ స‌దుపాయాల‌ను పెంచ‌నున్నట్లు వివరించారు.

కరోనాతో ముందుముందు సవాళ్లు ఉన్నప్పటికీ.. భారతదేశ వేగాన్ని మహమ్మారి ఆపలేదన్నారు. భారతదేశం కూడా పూర్తి జాగ్రత్తతో, అప్రమత్తతతో కరోనాతో పోరాడుతుందన్నారు. దీంతోపాటు జాతీయ ప్రయోజనాలను కూడా నెరవేరుస్తుందని తెలిపారు. వ్యవసాయ అవశేషాల నుంచి జీవ ఇంధనాన్ని తయారు చేసేందుకు దేశవ్యాప్తంగా అనేక కొత్త యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని చెప్పారు. ‘నేషన్ ఫస్ట్’ అనే స్ఫూర్తితో, దేశం కోసం నిరంతర కృషితో, ఈరోజు ప్రతి భారతీయుడి సెంటిమెంట్ రూపుదిద్దుకుంటోందని ప్రధాని అన్నారు. అందుకే, ఈ రోజు మన ప్రయత్నాలలో ఐక్యత, మన తీర్మానాలు ఉన్నాయన్నారు. నేడు మన విధానాల్లోనే స్థిరత్వం, దూరదృష్టి ఉన్నాయంటూ ప్రధాని మోదీ చెప్పారు.

Also Read:

UP Elections 2022: కృష్ణం వందే జగద్గురుం.. ఇదే యూపీ ఎన్నికల్లో బీజేపీ కొత్త మంత్రం

Haryana Landslide: ఘోర ప్రమాదం.. విరిగిపడిన కొండ చరియలు.. శిథిలాల కింద 20 మంది కూలీలు!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu