AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India – Afghanistan: భారత్ ఆపన్నహస్తం.. ఆప్ఘానిస్తాన్‌కు 5 లక్షల కోవాగ్జిన్ డోసుల అందజేత

India sends 5 lakh Covaxin doses to Afghanistan: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయనుకున్న

India - Afghanistan: భారత్ ఆపన్నహస్తం.. ఆప్ఘానిస్తాన్‌కు 5 లక్షల కోవాగ్జిన్ డోసుల అందజేత
Covaxin
Shaik Madar Saheb
|

Updated on: Jan 01, 2022 | 5:59 PM

Share

India sends Covaxin doses to Afghanistan: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయనుకున్న క్రమంలో కరోనా కొత్త వేరియంట్ ఆందోళనకు గురిచేస్తో్ంది. ఈ పరిస్థితుల్లో చాలా దేశాల్లో వ్యాక్సిన్ లేక అల్లాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ మరో దేశానికి ఆపన్నహస్తం అందించింది. మానవతా దృక్పథంతో భారత్ తన వంతు సహకారంగా తాలిబన్ రాజ్యం ఆఫ్గానిస్తాన్‌కు చేయూతనందించింది. శనివారం భారత్ ఆప్ఘానిస్తాన్ కు కోవిడ్ వ్యాక్సిన్లను పంపించింది. దీనిలో భాగంగా 5 లక్షల డోసుల కోవాగ్జిన్‌ టీకాలను పంపింది. కాబూల్‌లోని ఇందిరాగాంధీ పిల్లల ఆసుపత్రికి ఈ టీకాలను అప్పగించింది. తాలిబన్లు ఆక్రమణకు పాల్పడంతో చెలరేగిన హింసలో తీవ్రంగా నష్టపోయిన అఫ్గాన్‌కు మరికొన్ని వారాల్లో మరో ఐదు లక్షల డోసుల వ్యాక్సిన్‌ని పంపిణీ చేయనున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ శనివారం వెల్లడించింది.

తాలిబన్ల ఆక్రమణతో తీవ్రంగా నష్టపోయిన ఆప్ఘానిస్తాన్.. కరోనా విపత్కర పరిస్థితులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలో పలు దేశాలు సాయం చేయాలంటూ వేడుకుంటుంది. కరోనా కట్టడి కోసం సాయం అందించాలని డబ్ల్యూహెచ్ఓ కూడా పలు దేశాలను కోరుతోంది.

Also Read:

చలికాలంలో మడమల పగుళ్లు వేధిస్తున్నాయా..! ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందుతారు..

Chandrababu: వంగవీటి రాధా ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. కీలక కామెంట్స్