AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: వంగవీటి రాధా ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. కీలక కామెంట్స్

ఏపీ నుంచి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు వంగవీటి రాధా ఇంటికి వెళ్లారు.

Chandrababu: వంగవీటి రాధా ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. కీలక కామెంట్స్
Chandrababu
Ram Naramaneni
|

Updated on: Jan 01, 2022 | 6:00 PM

Share

ఏపీ నుంచి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు వంగవీటి రాధా ఇంటికి వెళ్లారు. తన హత్యకు కొందరు కుట్ర పన్నారని… రెక్కీ కూడా నిర్వహించారని రాధా చేసిన వ్యాఖ్యలు ఇటీవల సంచలనం రేపాయి. మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ సమక్షంలో రాధ చేసిన కామెంట్స్‌ రచ్చ రాజేశాయి. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు రాధా ఇంటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీ పరంగా అండంగా ఉంటామని ధైర్యం చెప్పారు చంద్రబాబు. ఈ సమయంలో రాధా తల్లి రత్నకుమారి కూడా పక్కనే ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రెక్కీ జరిగిందని రాధ చెప్పి ఏడు రోజులు అవుతుందని.. పోలీసులు ఇంత వరకు ఏ చర్యలు తీసుకున్నారో తెలియడం లేదని పేర్కొన్నారు. ఈ విషయంపై తాను డీజీపీకి కూడా లేఖ రాశానన్న బాబు.. ఎవరు రెక్కీ చేశారో, ఎందుకు చేశారో త్వరగా కనిపెట్టాలన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దోషులు ఎవరో పట్టుకునే అవకాశం ఉన్నా, ఆలస్యం ఎందుకు అవుతుందో అర్థం కావడం లేదన్నారు. గన్ మెన్ల ను ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. ఇలా చేస్తే పోలీసులు మీద విశ్వాసం కలుగుతుందా అని ఫైరయ్యారు. కాగా మీడియాతో మాట్లాడడానికి వంగవీటి రాధ నిరాకరించారు. అన్ని విషయాలు చంద్రబాబు మాట్లాడారని.. తాను మాట్లాడేది ఏమీ లేదని చెప్పారు.

వంగవీటి రాధా హత్యకు కుట్రపన్నిన వారిపై.. చర్యలు తీసుకోవాలని ఇటీవల  చంద్రబాబు డీజీపీ విజ్ఞప్తి చేశారు. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. రెక్కీ నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు చంద్రబాబు.

కాగా రాధా కామెంట్స్ నేపథ్యంలో సెక్యూరిటీ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే, తనకు భద్రత వద్దని, తాను ప్రజల్లో ఉండే మనిషినని సున్నితంగా తిరస్కరించారు  రాధ.

Also Read: East Godavari: నదిలో దూకిన లేడీ వాలంటీర్‌.. పరుగుపరుగన వచ్చి ఆమె కాపాడిన కౌన్సిలర్.. కానీ

Viral: సంచలనం.. ‘ప్లాస్టిక్‌ బిడ్డ’కి జన్మనిచ్చిన మహిళ.. ఇండియాలోనే