ఉత్తరప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రజలపై వరాలు కురిపిస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ బీజేపే యూపీపై ఫోకస్ చేసింది. యోగి సర్కార్ పలు పథకాలు ఇప్పటికే ప్రవేశపెట్టారు. ప్రధాన మంత్రి మోడీ కూడా తరుచూ యూపీలో పర్యటిస్తున్నారు. అటు ప్రతిపక్ష పార్టీలు కూడా అప్పుడే ప్రచారం ప్రారంభించాయి. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ యూపీలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు బీఎస్పీ కూడా ప్రచారం ప్రారంభించింది. ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫు ప్రియాంక గాంధీ వాద్రా ప్రచారం చేస్తున్నారు. వీరందరూ ఓటర్లను ఆకట్టుకునేలా పలు వరలు ప్రకటిస్తున్నారు.
ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. శనివారం లక్నోలో జరిగిన బహిరంగ సభలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ రైతులకు సాగునీటి కోసం ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. “గృహ వినియోగదారులకు ఎస్పీ ప్రభుత్వం 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఇస్తుందని,” అని యూపీ మాజీ ముఖ్యమంత్రి అన్నారు.
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్‌కు హామీ ఇస్తానని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి ఎన్నికల వాగ్దానాలను చేశారు. అయితే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతంగా ఉన్నందున్న ఎన్నికలపై సంద్గిత ఏర్పడింది.
“घरेलू बिजली उपभोक्ताओं को 300 यूनिट बिजली समाजवादी सरकार में मुफ्त होगी।
किसानों को सिंचाई के लिए बिजली मुफ्त मिलेगी।”
नववर्ष 2022 में समाजवादी सरकार बनने पर माननीय राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी का संकल्प- pic.twitter.com/5IrRfVgBWo
— Samajwadi Party (@samajwadiparty) January 1, 2022
Read Also.. PM Narendra Modi: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ.. రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నగదు జమ..