China Robots: ఆర్మీ విషయంలో డ్రాగన్ కంట్రీ(కంత్రీ) బిల్డప్ బట్టబయలు.. వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
Robot Soldiers: ఆర్మీ విషయంలో డ్రాగన్ దేశం ఇస్తున్న బిల్డప్ బట్టబయలు అయ్యింది. బయటకు చెప్పినంత సీన్ చైనా ఆర్మీకి లేదని తేలింది. తన ఆర్మీ విషయంలో ఇన్నాళ్లు గప్పాలు కొట్టింది చైనా. కానీ ఇటీవల అసలు విషయం బయటపడింది.
China Robot Soldiers: ఆర్మీ విషయంలో డ్రాగన్ దేశం ఇస్తున్న బిల్డప్ బట్టబయలు అయ్యింది. బయటకు చెప్పినంత సీన్ చైనా ఆర్మీకి లేదని తేలింది. తన ఆర్మీ విషయంలో ఇన్నాళ్లు గప్పాలు కొట్టింది చైనా. కానీ ఇటీవల అసలు విషయం బయటపడింది. చైనా సైన్యం అనుకున్నంత స్ట్రాంగ్‌గా లేదని ఇటీవల జరుగుతోన్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. చైనా సైనికులు చలి వాతావరణానికి తట్టుకోలేకపోతున్నారు. దీంతో రోబోలను బరిలోకి దించింది డ్రాగన్ దేశం. తమ సైనికులకు డ్రోన్ల ద్వారా వేడివేడి ఆహారం పంపిస్తోంది.
ఇన్నాళ్లు తమ సైనికులు ఉన్న సౌకర్యాలను గొప్పగా చూపించుకొంది చైనా. కానీ వాస్తవాలను మాత్రం వేరేలా ఉన్నాయి. చైనా సైనికులు బార్డర్లలోని చలిని తట్టుకోలేకపోతున్నారు. టిబెట్ సరిహద్దుల్లో ఉండలేకపోతున్నారు చైనా సోల్జర్స్. దీంతో వాస్తవాధీన రేఖ వద్దకు చైనా మెషిన్ గన్ రోబోలను తరలించింది. అక్కడి అత్యంత ఎత్తైన పర్వత వాతావరణానికి చైనా సైనికులు తట్టుకోలేకపోతున్నారని, ఈ నిర్ణయం తీసుకొంది. ఈ రోబోలు ఆయుధాలు ఆపరేట్ చేస్తూ, సామగ్రిని తరలిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికే టిబెట్‌లో ఉన్న కొందరు సైనికులకు సామర్థ్యాన్ని పెంచే ఎక్సోస్కెలిటన్ సూట్లను అందజేసింది చైనా ప్రభుత్వం.
అయితే, అతి చలి పరిస్థితుల్లో పనిచేయడం సైనికులకు ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతోంది. చలి వెదర్‌లో ఆయుధాలను చేతులతో పట్టుకుంటే గాయపడక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో అక్యూట్ మౌంటేన్ సిక్‌నెస్, హైఆల్టిట్యూడ్ పల్మనరీ ఎడీమా వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అటు తమ సైనికులను పూర్తిస్థాయిలో చలి వాతావరణానికి అలవాటు పడనివ్వడంలేదు చైనా. చలి వాతావారణానికి అలవాటు పడటం ఒక్కటే మార్గం ఉందని చెబుతున్నారు నిపుణులు. 3వేల మీటర్లు దాటాక కొన్నాళ్లు అక్కడే ఉండి వాతావరణానికి అలావాటు పడాలని అంటున్నారు. ఇక 4వేల మీటర్ల ఎత్తు దాటిన తర్వాత ప్రతి 300 మీటర్ల ఎత్తుకు వెళ్లే కొద్దీ ఒక రాత్రి బస చేయాల్సి ఉంటుందని వివరిస్తున్నారు.