చైనా యెల్లో డస్ట్‌తో ‘కిమ్’‌ ఇలాకాలో గుబులు.. కరోనా వస్తుందంటూ కీలక ఆదేశాలు

కరోనాకు పుట్టినిల్లైన చైనాను మరో ప్రమాదం ముంచెత్తింది. ఆ దేశంలో దుమ్ము తుఫాను(ఎల్లో డస్ట్‌) వీస్తోంది. దీంతో ఉత్తర కొరియా ప్రభుత్వం అప్రమత్తమైంది.

చైనా యెల్లో డస్ట్‌తో 'కిమ్'‌ ఇలాకాలో గుబులు.. కరోనా వస్తుందంటూ కీలక ఆదేశాలు
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 24, 2020 | 3:27 PM

China Yellow Dust: కరోనాకు పుట్టినిల్లైన చైనాను మరో ప్రమాదం ముంచెత్తింది. ఆ దేశంలో దుమ్ము తుఫాను(ఎల్లో డస్ట్‌) వీస్తోంది. దీంతో ఉత్తర కొరియా ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడి నుంచి వస్తున్న ఇసుక, దుమ్ము కణాలతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని కిమ్‌ ప్రభుత్వం తమ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని, బహిరంగ కార్యకలాపాలపై నిషేధం విధించింది. తలుపులు, కిటికీలు బిగించుకోవాలని అంతేకాదు ఈ యెల్లో డస్ట్ ప్రమాదం గురించి వివిధ రాయబార కార్యాలయాలకు సమాచారం ఇచ్చింది.

ఇక ఈ విషయాన్ని ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని రష్యన్ ఎంబసీ తన ఫేస్‌బుక్‌ పేజీలో వెల్లడించింది. ఇదిలా ఉంటే మరోవైపు ఈ యెల్లో డస్ట్‌ విషయంలో ఉత్తరకొరియా వాదనలను దక్షిణ కొరియా కిట్టిపారేస్తోంది. దూళికణాల ద్వారా కరోనా వ్యాపించే అవకాశం లేదని వారు చెబుతున్నారు. ఇక ఉత్తర కొరియాతో పాటు తుర్కెమిస్తాన్ కూడా తన ప్రజలకు ఇదే తరహా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఏటా నిర్దిష్ట కాలాల్లో వీచే యెల్లో డస్ట్ వలన పలు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.

Read more:

కోడలు ఆత్మహత్య.. అవమానాలు భరించలేక మరుసటి రోజే మామ సూసైడ్‌

25 రూపాయలకే డ్రెస్ అంటూ ప్రచారం.. ఎగబడ్డ జనం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu