కోడలు ఆత్మహత్య.. అవమానాలు భరించలేక మరుసటి రోజే మామ సూసైడ్‌

ఒక రోజు వ్యవధిలో ఒకే ఇంట్లో మామ, కోడలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. చిన్నగొట్టిగల్లు మండలం చిట్టెచెర్ల గ్రామానికి చెందిన ఆనంద్‌ రెడ్డికి

  • Manju Sandulo
  • Publish Date - 2:19 pm, Sat, 24 October 20

Pregnant Woman Suicide: ఒక రోజు వ్యవధిలో ఒకే ఇంట్లో మామ, కోడలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. చిన్నగొట్టిగల్లు మండలం చిట్టెచెర్ల గ్రామానికి చెందిన ఆనంద్‌ రెడ్డికి, ఆరు నెలల క్రితం హరితతో వివాహం జరిగింది. ఇక హరిత గర్భం కూడా దాల్చగా.. ఇటీవల ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త, అత్తమామ వేధింపుల వలనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందంటూ వారు ఆరోపించారు. ఈ మరుసటి రోజే హరిత మామ రామిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు.

అయితే హరిత ఆత్మహత్యపై గ్రామస్తుల నుంచి విమర్శలు రావడంతో అవమానంగా భావించిన రామిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే హరిత ఆత్మహత్య జరిగినప్పటి నుంచి ఆమె భర్త, అత్త పరారీలో ఉన్నారు. మృతదేహాలు చూసేందుకు కూడా వారు రాలేదు. కాగా బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆనంద్‌ రెడ్డి.. కరోనా వలన గత ఏడు నెలలుగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ చేస్తున్నారు.

Read More:

25 రూపాయలకే డ్రస్ అంటూ ప్రచారం.. ఎగబడ్డ జనం

దర్శనాల పెంపుపై త్వరలోనే నిర్ణయం: టీటీడీ ఈవో