KIM JONG UN: మరో ప్రమాదకర ఆయుధాన్ని పరీక్షించిన ఉత్తర కొరియా.. కిమ్ క్షిపణి ప్రయోగాలు ఎందుకు?

North Korea: ఉత్తర కొరియా నిరంతరం క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది. ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష నిర్వహించడం ఈ నెలలో ఇది ఆరోసారి. ఈ వార్తలను తాజాగా ఉత్తర కొరియా ధృవీకరించింది.

KIM JONG UN: మరో ప్రమాదకర ఆయుధాన్ని పరీక్షించిన ఉత్తర కొరియా.. కిమ్ క్షిపణి ప్రయోగాలు ఎందుకు?
Kim Jong Un
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 29, 2022 | 8:29 AM

North Korea KIM JONG UN: ఉత్తర కొరియా నిరంతరం క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది. ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష నిర్వహించడం ఈ నెలలో ఇది ఆరోసారి. ఈ వార్తలను తాజాగా ఉత్తర కొరియా ధృవీకరించింది. ఉత్తర కొరియా తాజా ఆయుధ పరీక్షలను ధృవీకరించడానికి ఆ దేశ నియంత కిమ్ జోంగ్ ఉన్(KIM JONG UN) దేశంలోని ఆయుధ కర్మాగారాలను సందర్శించారు. ఈ నెల ప్రారంభంలో, ఉత్తర కొరియా(North Korea) ఒక టాక్టికల్ గైడెడ్ మిస్సైల్, ఒక బాలిస్టిక్ మిస్సైల్, రెండు హైపర్సోనిక్ క్షిపణులను పరీక్షించింది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు ఎందుకు చేస్తోంది? ఎలాంటి హెచ్చరికలు లేకుండా చేస్తున్న పరీక్షల వెనక కారణాలేంటీ? కిమ్‌ ఎవరిని భయపెట్టాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ఉన్ భయపడుతున్నారా? లేక ఏ దేశాన్నైనా భయపెడుతున్నారా? ఉత్తర కొరియా అసలు క్షిపణి పరీక్షలు ఎందుకు చేస్తోంది? ఇవే ఇప్పుడు ప్రపంచ దేశాలను తొలిచేస్తున్న ప్రశ్నలు. ముఖ్యంగా జపాన్‌, దక్షిణ కొరియా, అమెరికా దేశాలకు సమస్యగా మారారు కిమ్‌. ఉత్తర కొరియా తాజాగా చేపట్టిన క్షిపణి పరీక్షలు జపాన్‌ను కుదిపింది. 2017 ఆగస్టులో కూడా ఆ దేశం చేపట్టిన మిస్సైల్ పరీక్షల సైరన్ మోతలు జపాన్‌కు వినిపించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ఉత్తర కొరియా ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని జపాన్ మీదుగా పసిఫిక్ మహాసముద్రంలోకి ప్రయోగించింది. ఇది పెద్ద సాహసమని అంటున్నారు నిపుణులు.

ఈసారి ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణులన్నీ తక్కువ దూరాన్ని కలిగి ఉన్నవి కావడం గమనార్హం. జపాన్ తీరానికి చాలా దూరంగా సముద్రంలో ల్యాండ్ అయ్యాయి. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తోంది జపాన్. ఆ క్షిపణి మిస్‌ అయ్యి, జపాన్‌ భూభాగంలో పడితే, ఏంటి పరిస్థితి అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతానికి కిమ్ జోంగ్ ఉన్ కాస్త వెనక్కు తగ్గినట్టే కనిపిస్తున్నా, తాను అనుకున్న ఫలితాలు రాకపోతే మళ్లీ మొదలుపెట్టే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇక్కడ ఇంకో ప్రధాన విషయం ఏంటంటే, ఉత్తర కొరియా జీడీపీలో సుమారు అయిదొంతులు మిలిటరీ కోసం ఖర్చు చేస్తున్నారు. ఇది పలు దేశాలను కలవరపెడుతోంది. అయితే, కిమ్‌ అమెరికాను భయపెట్టడానికే ఇలాంటి దుస్సాహసాలు చేస్తున్నారని అంటున్నారు నిపుణులు. ఒకవేళ అమెరికా కోసం కాకపోతే, కిమ్‌ భయపడే క్షిపణి పరీక్షలు చేయిస్తున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, ఈ మిస్సైల్‌ పరీక్షలు మాత్రం దక్షిణ కొరియా, జపాన్‌లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఉత్తర కొరియా ఈ వారం అధునాతన దీర్ఘ-శ్రేణి క్రూయిజ్ క్షిపణులు మరియు వ్యూహాత్మక గైడెడ్ క్షిపణులను పరీక్షించినట్లు ఉత్తర కొరియా రాష్ట్ర మీడియా KCNA శుక్రవారం ధృవీకరించింది . నియంత కిమ్ జోంగ్ ఉన్ ఒక పెద్ద ఆయుధ కర్మాగారాన్ని సందర్శించినట్లు చెబుతారు. 2022లో ఉత్తర కొరియా వరుసగా ఆరు ఆయుధాలను పరీక్షించడంతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఒక నెలలో ఇన్ని క్షిపణులను ప్రయోగించిన తరువాత, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు దానిపై నిరసన వ్యక్తం చేశాయి.

ఉత్తర కొరియా ఇటీవలి నెలల్లో కొత్త క్షిపణుల పరీక్షలను వేగవంతం చేసింది. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కొన్ని రాయితీలు మరియు డిమాండ్లను చర్చించడానికి ముందు క్షిపణి పరీక్షల ద్వారా తన పొరుగు దేశాలపై మరియు యునైటెడ్ స్టేట్స్‌పై ఒత్తిడి తెచ్చే ఉద్దేశపూర్వక విధానాన్ని సమీక్షిస్తున్నారని కొందరు నిపుణులు అంటున్నారు.

Read Also… Political Parties: దేశంలో అత్యధిక ఆస్తులు కల్గిన పార్టీగా బీజేపీ.. తాజా నివేదికలో టీడీపీ ఏ స్థానంలో ఉందో తెలుసా?