యూకే కుర్రాడి పెళ్లి గోల! ఏకంగా 5000 మంది క్యూకట్టారట.. మామూలోడు కాదుగా..!

యూకే కుర్రాడి పెళ్లి గోల! ఏకంగా 5000 మంది క్యూకట్టారట.. మామూలోడు కాదుగా..!
Muhammad Malik

ఔరా! అని ముక్కుమీద వేలేసుకునే సంఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. ఓ గ్రీకు వీరుడికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 5000 మంది భామలు ప్రపోజ్ చేశారట. ఆ కథేంటో తెలుసుకుందాం..

Srilakshmi C

|

Jan 28, 2022 | 9:13 PM

Muhammad Malik: టెక్నాలజీ పుణ్యమో, కాలం మహిమో తెలియదుకానీ రోజు రోజుకూ ప్రపంచంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక యువత అభిరుచుల్లో కూడా కొత్తదనం వింతపోకడలు పోతోంది. అవును.. ఔరా! అని ముక్కుమీద వేలేసుకునే సంఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. ఓ గ్రీకు వీరుడికి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 5000 మంది భామలు ప్రపోజ్ చేశారట. ఆ కథేంటో తెలుసుకుందాం.. UKలో నివసిస్తున్న ముహమ్మద్ మాలిక్ (29) అనే కుర్రాడికి పెళ్లి వయసొచ్చింది. ఐతే అతనికి అరేంజ్డ్ మ్యారేజ్ (arranged marriage) చేసుకోవడం ఇష్టం లేదట. దీంతో జంట కోసం వినూత్నంగా వెతుకులాట ప్రారంభించాడు. బ్రిటన్ (Britain) వీధుల్లో పెళ్లి చేసుకునేందుకు చక్కని అమ్మాయి కోసం వెతుకుతున్నట్టు వెడ్డింగ్ బోర్డులను పెట్టాడు.

ఈ బోర్డుల్లో ‘అరెంజ్డ్ మ్యారేజ్ నుండి నన్ను రక్షించండి’ అని రాసి పెట్టాడు. అనంతరం… ఏకంగా 5000 మంది యువతుల నుంచి సంప్రదింపు లేఖలొచ్చాయట. ఐతే మహ్మద్ మాలిక్ డేటింగ్ యాప్‌ (Muslim dating app Muzmatch) ప్రచారం కోసమే ఈ స్టంట్ చేశాడనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలోకొచ్చాయి. అంతేకాదు సదరు వ్యక్తి ఇప్పటికే వివాహం చేసుకున్నాడని, #FindMalikAWife హ్యాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లుకొడుతోంది. ఇందుకోసం నెట్టింట ప్రత్యేక వెబ్‌పోర్టల్ findMALIKswife.comకూడా నడుస్తోందంటే సదరు వ్యక్తి పెళ్లి గోల ఏ రేంజ్‌లో దుమారం లేపివుంటుందో ఆలోచించండి!!

Also Read:

TS SSC Exams 2022: తెలంగాణ టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu