AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nobel Prize in Literature: సాహిత్యంలో అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి విజేత అబ్దుల్‌రాజాక్ గుర్నా.. ప్రకటించిన కమిటీ!

ప్రపంచ సాహితీవేత్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ప్రతిష్టాత్మక సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ ప్రకటించారు. సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ నవలా రచయిత అబ్దుల్‌రాజాక్ గుర్నాకు ప్రకటించారు.

Nobel Prize in Literature: సాహిత్యంలో అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి విజేత అబ్దుల్‌రాజాక్ గుర్నా.. ప్రకటించిన కమిటీ!
Nobel Prize In Literature
KVD Varma
|

Updated on: Oct 07, 2021 | 5:22 PM

Share

Nobel Prize 2021: ప్రపంచ సాహితీవేత్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ప్రతిష్టాత్మక సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ ప్రకటించారు. సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ నవలా రచయిత అబ్దుల్‌రాజాక్ గుర్నాకు ప్రకటించారు. ఈయన సంస్కృతులపై వలసవాదం ప్రభావాలు అనే విషయంలో తన రచనావ్యాసంగాన్ని కొనసాగించారు. ఈయన రాసిన ‘ప్యారడైజ్’ (1994) నవలకు గాను ఈ బహుమతి ప్రదానం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది ఆయన రాసిన నాల్గవ నవల. తూర్పు ఆఫ్రికాలో 1990లో నెలకొని ఉన్న పరిస్థితులకు సంబంధించి ఒక పరిశోధన యాత్ర నుంచి ఈ నవల ఉద్భవించింది.

అబ్దుల్‌రాజాక్ గురించి:

అబ్దుల్‌రాజాక్ గుర్నా 1948 లో జన్మించారు. జాంజిబార్ ద్వీపంలో పెరిగారు. కానీ, 1960 ల చివరలో శరణార్థిగా ఇంగ్లాండ్ వచ్చారు. ఇటీవలి పదవీ విరమణ వరకు, ఆయన కాంటర్‌బరీలోని కెంట్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల- పోస్ట్‌కాలనీ సాహిత్యాల ప్రొఫెసర్‌గా ఉన్నారు. అబ్దుల్‌రాజాక్ గుర్నా పది నవలలు.. అనేక చిన్న కథలను ప్రచురించారు. శరణార్థి అంతరాయం థీమ్ ఆయన రచనల్లో కనిపిస్తుంది. అతను ఆంగ్ల భాషలో తన 21 ఏళ్ల వయస్సులో రాయడం ప్రారంభించారు. స్వాహిలి ఆయన మాతృ భాష అయినప్పటికీ, ఇంగ్లీష్ ఆయన సాహిత్య సాధనంగా మారింది.

సాహిత్యంలో నోబెల్ ఇలా..

నోబెల్ విజేతను స్వీడిష్ అకాడమీలోని 18 మంది సభ్యులు ఎన్నుకున్నారు – 2017 లో లైంగిక వేధింపులు, ఆర్థిక దుష్ప్రవర్తన కుంభకోణానికి గురైన తర్వాత మరింత పారదర్శకంగా మారడానికి ప్రయత్నాలు చేసిన ఒక అత్యున్నత సంస్థ ఇది. గత సంవత్సరం నోబెల్ బహుమతి అమెరికన్ కవి లూయిస్ గ్లోక్ కి వచ్చిం. ఆస్ట్రియన్ రచయిత పీటర్ హ్యాండ్కే 2019 లో వివాదాస్పద ఎంపిక ద్వారా ఈ బహుమతి గెలుచుకున్నారు. ఈయన స్రెబ్రెనికా మారణహోమాన్ని ఖండించారు.యుద్ధ నేరస్థుడు స్లోబోడాన్ మిలోసివిక్ అంత్యక్రియలకు హాజరయ్యారు. దీంతో ఈయనకు నోబెల్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

సాహిత్యానికి నోబెల్ బహుమతి 118 సార్లు లభించింది. కేవలం 16 మంది మహిళలకు ఇప్పటివరకూ ఈ బహుమతి లభించింది. 21 వ శతాబ్దంలో నోబెల్ వచ్చిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. 2019 లో, స్వీడిష్ అకాడమీ ఈ అవార్డు తక్కువ “పురుష-ఆధారిత” “యూరోసెంట్రిక్” గా మారుతుందని వాగ్దానం చేసింది.

ఈ ఏడాది ఇప్పటివరకూ నోబెల్ ఇలా..

ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతులను ప్రకటిస్తూ వస్తున్నారు. ఒక్కోరోజు ఒక్కో రంగానికి సంబంధించిన వారికి బహుమతులు ప్రకటిస్తున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన నోబెల్ బహుమతుల సందడిలో మొదటి రోజు వైద్య రంగానికి చెందిన అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపోటియన్ లకు బహుమతి ప్రకటించారు. తరువాత రెండోరోజు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతిక శాస్త్రంలో నోబెల్ వరించింది. శాస్త్రవేత్తలు సుకురో మనాబో, క్లాస్‌ హాసిల్‌మన్‌, జార్జియో పారిసీలను ఈ ఏడాది నోబెల్‌ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించింది. ఇక మూడోరోజు (6 అక్టోబర్ 2021) రసాయన శాస్త్రానికి సంబంధించి బెంజమిన్ లిస్ట్, డేవిడ్ మాక్ మిలన్ లకు నోబెల్ బహుమతి లభించింది.

నోబెల్ బహుమతి ప్రకటన షెడ్యూల్ ఇదీ

ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతులను ప్రకటిస్తారు. ఈ సంవత్సరం అంటే 04 అక్టోబర్ నుంచి నోబెల్ బహుమతుల ప్రకటన ప్రారంభించారు. మొదట వైద్యానికి సంబంధించి నోబెల్ విజేతలను ప్రకటించగా.. రెండో రోజు అంటే 05 అక్టోబర్ నాడు భౌతిక శాస్త్రంలో నోబెల్ విజేతలను ప్రకటించారు. ఇక మూడోరోజైన ఈరోజు (06 అక్టోబర్) రసాయన శాస్త్రంలో విజేతలను ప్రకటించారు. నాలుగో రోజు గురువారం (07 అక్టోబర్) సాహిత్యంలో బహుమతి ప్రకటించారు. ఇక రేపు శుక్రవారం (08 అక్టోబర్) ఆర్ధిక శాస్త్రంలో.. శనివారం (09 అక్టోబర్) శాంతికి సంబంధించి నోబెల్ బహుమతులను ప్రకటిస్తారు.

ఇవి కూడా చదవండి: Nobel Prize 2021: కెమిస్ట్రీలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి.. మూడోరకం ఉత్ప్రేరకాన్ని కనిపెట్టినందుకే!

Nobel Prize: వైద్యశాస్త్రంలో ఇద్దరు నోబెల్ బహుమతి.. అమెరికాకు చెందిన డేవిడ్‌ జూలియస్‌, అర్డెమ్‌ పటాపౌటియన్‌లకు పురస్కారం

Nobel Prize 2021: భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతులు.. ఏ అంశంపై కృషి చేసినందుకు ఈ పురస్కారం ఇచ్చారంటే..