ఒకే కాన్పులో జన్మించిన తొమ్మిది మంది చిన్నారులు ఇప్పుడు ఎలా ఉన్నారంటే..?
సాధారణంగా మహిళలు కవల పిల్లలకు జన్మనివ్వడం అరుదుగా జరుగుతుంది. కొన్ని సార్లు ముగ్గురికి జన్మనిచ్చిన ఘటనలు చూశాం. అంతే కాదు నలుగురికి ఒకే కాన్పుల్లో జన్మనిచ్చిన ఘటనలూ అప్పుడప్పుడు విన్నాం. కానీ ఆఫ్రికాలోని ఓ దేశానికి...
సాధారణంగా మహిళలు కవల పిల్లలకు జన్మనివ్వడం అరుదుగా జరుగుతుంది. కొన్ని సార్లు ముగ్గురికి జన్మనిచ్చిన ఘటనలు చూశాం. అంతే కాదు నలుగురికి ఒకే కాన్పుల్లో జన్మనిచ్చిన ఘటనలూ అప్పుడప్పుడు విన్నాం. కానీ ఆఫ్రికాలోని ఓ దేశానికి చెందిన మహిళ.. ఒకరిద్దరు కాదు.. ఒకే కాన్పులో తొమ్మిది మందికి జన్మనిచ్చింది. నమ్మేందుకు కాస్త కష్టంగా అనిపించినా ఇది మాత్రం అక్షర సత్వం. ఆ మహిళ గిన్నిస్ రికార్డులకెక్కి సెలబ్రిటీగా మారిపోయింది. డాక్టర్లు ఏడుగురు పిల్లలే జన్మిస్తారు అనుకున్నా.. అదనంగా మరో ఇద్దరు పిల్లలు పుట్టేసరికి వారూ షాక్ అయ్యారు. అంతే కాదండోయ్.. అలా పుట్టిన పిల్లలందరూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. తాజాగా వారు మొదటి పుట్టినరోజు వేడుకలను సైతం జరుపుకున్నారు. ఆఫ్రికాలోని మాలీ దేశానికి చెందిన హాలిమా సిస్సే.. ఏడాది క్రితం ఒకే కాన్పులో తొమ్మిది మంది జన్మనిచ్చారు. మొరాకోలోని ఓ ఆస్పత్రిలో ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో ఆమె తొమ్మిది మంది చిన్నారులకు జన్మనిచ్చింది. వీరిలో అయిదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు.
పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఈ తొమ్మిది మంది చిన్నారులు ప్రస్తుతం ఒక సంవత్సర వయస్సు పూర్తి చేసుకున్నారు. తాజాగా వీరి మొదటి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. మొరాకోలో వారు పుట్టిన క్లినిక్‌లోనే వేడుకలు నిర్వహించినట్లు ఆ చిన్నారుల తండ్రి అబ్దెల్‌కాదెర్ అర్బీ వెల్లడించారు. నర్సులు, తమ అపార్ట్‌మెంట్‌లోని మరికొంత మంది సన్నిహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నట్లు తెలిపారు. పిల్లలందరినీ పూర్తి ఆరోగ్యంగా చూస్తుంటే సంతోషంగా ఉందంటున్న ఆ తండ్రి.. భార్య హలీమా సిస్సె సైతం కోలుకున్నట్లు వివరించారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
SI Suicide: ములుగు జిల్లాలో విషాదం.. పోలీస్ స్టేషన్ క్యాంప్‌లో ఉరివేసుకుని ఎస్ఐ ఆత్మహత్య!
Tirumala: తిరుమలలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. నాలుగు రోజుల హై డ్రామాకు తెర
Hyderabad: భాగ్యనగర్ వాసులకు గుడ్ న్యూస్.. ఎంఎంటీఎస్ టికెట్ ధరలు తగ్గింపు.. నేటి నుంచి అమల్లోకి