Pandemic: కరోనాకు మించిన మరో మహమ్మారి ముప్పు.. హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు
కరోనా వైరస్ మనందరి జీవితాల్లో ఎలాంటి ప్రభావం చూపిందో తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైపోవడం, బయటికి వెళ్లాలంటే మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్లు వాడటం, కరోనా పరీక్షలు చేయించుకోవడం, వ్యాక్సిన్‌లు తీసుకోవడం ఇలా ఆందోళకరమైన రోజులు ఉండేవి. అంతేకాదు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కూడా కరోనా దెబ్బకు కుదేలైపోయింది. విదేశాలకు కూడా వెళ్లలేని పరిస్థితి ఉండేది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్‌లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రులు మొత్తం కరోనా పేషెంట్లతో కిక్కిరిసిపోయిన సందర్భాలు ఉన్నాయి.
కరోనా వైరస్ మనందరి జీవితాల్లో ఎలాంటి ప్రభావం చూపిందో తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైపోవం, బయటికి వెళ్లాలంటే మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్లు వాడటం, కరోనా పరీక్షలు చేయించుకోవడం, వ్యాక్సిన్‌లు తీసుకోవడం ఇలా ఆందోళకరమైన రోజులు ఉండేవి. అంతేకాదు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ కూడా కరోనా దెబ్బకు కుదేలైపోయింది. విదేశాలకు కూడా వెళ్లలేని పరిస్థితి ఉండేది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్‌లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రులు మొత్తం కరోనా పేషెంట్లతో కిక్కిరిసిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు లేవు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల తమ సాధారణ జీవితంలోకి వచ్చేశారు. ఇలాంటి తరుణంలో ఆరోగ్య నిపుణులు మరో ఆందోళనకరమైన విషయాన్ని వెల్లడించారు. ప్రపంచానికి డిసీస్ ఎక్స్ రూపంలో మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు.
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి తరహాలోనే ఈ డిసీజ్ ఎక్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని.. బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్‌కు సారథ్యం వహిస్తున్న డేమ్ కేట్ బింగ్‌హామ్ చెప్పినట్లు డైలీ మెయిల్ అనే సంస్థ తన కథనంలో వివరించింది. అయితే డిసీజ్ ఎక్స్ అనేది కరోనా మహమ్మారి కంటే ఏకంగా ఏడు రెట్లు ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కొత్త మహమ్మారిని ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉండాలని ఎప్పటి నుంచో సూచనలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో అనేక కరోనా మహమ్మారితో సహా అనేక వైరస్‌లు వ్యాప్తిలో ఉన్నాయి. అంతేకాదు ఇవి ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతునే ఉన్నాయి. అయితే మరి వాటన్నింటినీ మానవాళి ముప్పుగా పరిగణించలేం. కానీ అందులో కొన్ని మనుషులపై తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే వేలాది వైరస్‌లు ఉన్నటువంటి 25వ వైరస్ కుటుంబాలను శాస్త్రవేత్తలు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అయితే వాటిలో ఏదైనా వైరస్ మహమ్మారిగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే వైరస్‌లు అనేవి ఈ జాబితాలో లేవు. కరోనా మహమ్మారి సోకినటువంటి వారిలో చాలా మంది వైరస్ బారి నుంచి తప్పించుకోగలిగారు. కానీ డిసీజ్ ఎక్స్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిపై ప్రభావాన్ని చూపిస్తుందని డేమ్ కేట్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే డిసీజ్ ఎక్స్‌ను ఎదుర్కోవడానికి బ్రిటన్‌కి చెందిన శాస్త్రవేత్తలు ఇప్పటికే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైపోయినట్లు సమాచారం. సుమారు 200 మంది శాస్త్రవేత్తలు విల్డ్‌షైర్‌లోని పోర్ట్‌డౌన్ లాబోరేటరిలో జంతువుల నుంచి మనుషులకు వేగంగా వ్యాప్తించే వైరస్‌లను అడ్డుకోవడానికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.