China: దూకుడు పెంచుతోన్న చైనా.. సముద్రంపైనే తేలియాడే కంచెలు ఏర్పాటు
కవ్వింపు చర్యలకు పాల్పడటంతో చైనా ఎప్పుడూ ముందుంటుంది. అయితే ఇప్పుడు ఏకంగా సముద్రాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. దక్షిణ చైనా సముద్రంలోని తేలియాడే కంచెను ఏర్పాటు చేసేసింది. అయితే ఈ వివాదాస్పద స్థలంలో తమ దేశానికి చెందినటువంటి చేపల వేట పడవలు రాకుండా బీజింగ్ ఇలా చేసిందని ఫిలిప్పీన్స్ ఆరోపణలు చేసింది. ఈ విషయాన్ని ఫిలిప్పీన్స్ కోస్టుగార్డ్ ప్రతినిధి జైటర్రేలా ట్విటర్‌లో వెల్లడించారు.
కవ్వింపు చర్యలకు పాల్పడటంతో చైనా ఎప్పుడూ ముందుంటుంది. అయితే ఇప్పుడు ఏకంగా సముద్రాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. దక్షిణ చైనా సముద్రంలోని తేలియాడే కంచెను ఏర్పాటు చేసేసింది. అయితే ఈ వివాదాస్పద స్థలంలో తమ దేశానికి చెందినటువంటి చేపల వేట పడవలు రాకుండా బీజింగ్ ఇలా చేసిందని ఫిలిప్పీన్స్ ఆరోపణలు చేసింది. ఈ విషయాన్ని ఫిలిప్పీన్స్ కోస్టుగార్డ్ ప్రతినిధి జైటర్రేలా ట్విటర్‌లో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. సాధారణ సముద్ర గస్తీ సమయంలో శుక్రవారం రోజున ఫిలిప్పీన్స్‌కు చెందని కోస్టుగార్డు ఈ తేలియాడేటటువంటి కంచెను గుర్తించింది. అయితే ఈ కంచె పొడవు చూసుకుంటే దాదాపు 900 అడుగుల పైనే ఉంది. చైనాకు చెందిన కోస్టుగార్డ్ ఇలాంటి చర్యకు పాల్పడటాన్ని ఫిలిప్పీన్స్ కోస్టుగార్డ్, బ్యూరో ఆఫ్ ఫిషరీస్ అండ్ ఆక్వాటిక్ రిసోర్స్ వ్యతికేస్తోంది.
బాజో డె మాసిన్‌లోక్ అనే ఆగ్నేయ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే ఇక్కడ ఉన్న సముద్ర దిబ్బల వైపుగా తమ దేశానికి చెందిన చేపల వేట పడవలు రాకుండా ఉండేందుకు ఇలా చేస్తోంది. అంతేకాదు ఇది మా జాలర్ల జీవనోపాధిని కూడా దెబ్బతీస్తోందని ఫిలిప్పీన్స్ కోస్టుగార్డ్ ప్రతినిధి తెలిపారు. అయితే ఇక్కడ చైనా బోట్లు, ఫిలిప్పిన్స్ నౌకలను 15 సార్లుగా రేడియోసెట్‌లో హెచ్చరికలు చేశాయి. చైనా చట్టాలను ఉల్లంఘిస్తున్నారంటూ వ్యాఖ్యానించాయి. కానీ.. ఫిలిప్పీన్స్ నౌకలో కొందరు మీడియా సిబ్బంది ఉన్నట్లు తెలుసుకొని చైనాకు చెందినటువంటి నౌకలు అక్కడి నుంచి వెనుదిరిగాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు మనీలాలో ఉన్న చైనా దౌత్యకార్యాలయం స్పందించలేదు. ఫిలిప్పీన్స్ రాజకీయ ఆరోపణల కోసం తప్పుడు సమాచారాన్ని వాడుకుంటున్నట్లు చైనా ఆరోపణలు చేసింది. ఇదిలా ఉండగా.. చైనాకు చెందిన భారీ పడవలు ముందుగానే తమపై నిఘా వేసినట్లు ఫిలిప్పీన్స్ మత్స్యకారులు అంటున్నారు. తాము ఆ చోటుకి వెళ్లిన సమయంలో తేలియాడే కంచెను అక్కడ వేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి చైనా.. ఈ ప్రాంతాన్ని హువాంగ్ యాండావ్ అని పిలిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోని వివాదస్పద ప్రాంతాల్లో ఇది ఒకటి.
PCG and BFAR Condemn CCG’s Installation of Floating Barrier in the Southeast of BDM Shoal
The Philippine Coast Guard (PCG) and Bureau of Fisheries and Aquatic Resources (BFAR) strongly condemn the China Coast Guard’s (CCG’s) installation of floating barrier in the Southeast… pic.twitter.com/ed4cFtXcQs
— Jay Tarriela (@jaytaryela) September 24, 2023