Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: డెల్టా వేరియంట్‌ కలకలం.. న్యూజిలాండ్‌లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు..

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో అమెరికా లాంటి అగ్రదేశాలకే సాధ్యం కాలేదు. బ్రిటన్‌, జపాన్‌, జర్మనీ లాంటి దేశాలు కూడా చేతులెత్తేశాయి. అయితే ఒక్కదేశం మాత్రం

Coronavirus: డెల్టా వేరియంట్‌ కలకలం.. న్యూజిలాండ్‌లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు..
Follow us
Basha Shek

|

Updated on: Nov 06, 2021 | 10:36 PM

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో అమెరికా లాంటి అగ్రదేశాలకే సాధ్యం కాలేదు. బ్రిటన్‌, జపాన్‌, జర్మనీ లాంటి దేశాలు కూడా చేతులెత్తేశాయి. అయితే ఒక్కదేశం మాత్రం పటిష్ఠమైన ప్రణాళికతో కరోనా కోరలు తెంచింది. అదే న్యూజిలాండ్‌. కొవిడ్‌ నియంత్రణలో ప్రపంచ దేశాల ప్రశంసలు పొందిన కివీస్‌ను ఇప్పుడు డెల్టా వేరియంట్‌ కలవరపెడుతోంది. కొవిడ్‌ ఆ దేశంలోకి అడుగుపెట్టిన దగ్గరి నుంచి ఎన్నడూ లేని విధంగా ఆ దేశంలో ఒక్కరోజులోనే 206 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 200 కేసులు అత్యధిక జనాభా ఉన్న అక్లాండ్‌ నగరంలోనే నమోదవ్వడం గమనార్హం. గత కొన్ని నెలలుగా ఆక్లాండ్‌లో పటిష్ఠంగా కరోనా ఆంక్షలు అమలవుతున్నాయి. అయినా ఈ స్థాయిలో కొత్త కేసులు రావడం ఆక్లాండ్‌ వాసులతో పాటు కివీస్‌ దేశ ప్రజలను కలవరపెడుతోంది.

కొవిడ్‌ను నియంత్రించడంలో ప్రపంచ దేశ అధినేతల ప్రశంసలు అందుకున్నారు కివీస్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌. న్యూజిలాండ్‌లో ఇప్పటివరకు మొత్తం 7వేల కరోనా కేసులు నమోదు కాగా.. 31 మంది మృత్యువాత పడ్డారు. అయితే అన్ని వైరస్‌లను సమర్థంగా నియంత్రించిన న్యూజిలాండ్‌ ప్రభుత్వం డెల్టా వేరియంట్లను మాత్రం కట్టడి చేయడంలో విఫలమైంది. మరోవైపు కొత్త కేసుల పెరుగుదల టీకాల ఆవశ్యకతను తెలియజేసిందని ఆ దేశ ఆరోగ్యశాఖామంత్రి చెప్పుకొచ్చారు. ప్రజలందరూ కరోనా టీకా తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Also Read:

US Music Festival: మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో మరణ మృదంగం.. తొక్కిసలాటలో 8 మంది మృతి.. 300 మందికి పైగా గాయాలు..

Fuel Tanker Blast: సియర్రాలియోన్‌లో పెను విషాదం.. భారీ పేలుడు ఘటనలో 91 మంది మృతి..

డ్రైవర్‌ సీటుకి వెనుకవైపు ఉన్న సందేశం చూసి ఆశ్చర్య పోయిన ప్యాసింజర్.. ఇంతకీ ఆ సందేశం ఏంటో తెలుసా..?? వీడియో