AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేము కూడా, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వినియోగంపై నెదర్లాండ్స్ ప్రభుత్వ నిషేధం

ఆస్ట్రాజెనికా కరోనా వైరస్  వ్యాక్సిన్ వినియోగంపై నిషేధం విధించిన దేశాల్లో నెదర్లాండ్స్ కూడా చేరింది. ఇప్పటికే డెన్మార్క్, నార్వే, ఐర్లాండ్, ఆస్ట్రియా దేశాలు ఈ వ్యాక్సిన్ ని బ్యాన్ చేశాయి.

మేము కూడా, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వినియోగంపై నెదర్లాండ్స్  ప్రభుత్వ నిషేధం
Astrazeneca Vaccine
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Mar 15, 2021 | 4:30 PM

Share

ఆస్ట్రాజెనికా కరోనా వైరస్  వ్యాక్సిన్ వినియోగంపై నిషేధం విధించిన దేశాల్లో నెదర్లాండ్స్ కూడా చేరింది. ఇప్పటికే డెన్మార్క్, నార్వే, ఐర్లాండ్, ఆస్ట్రియా దేశాలు ఈ వ్యాక్సిన్ ని బ్యాన్ చేశాయి. ఇటలీ సైతం దీన్ని  బ్లాక్ లిస్టులో  పెట్టింది.  ఈ టీకామందు తీసుకున్న రోగుల్లో కొంతమంది శరీరంలో రక్తం గడ్డ కట్టినట్టు (బ్లడ్ క్లాటింగ్) ఇదివరకే ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పుడు నెదర్లాండ్స్ కూడా తమ దేశంలో దీన్ని తీసుకున్న కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ తో బాధ పడుతున్నారని పేర్కొంది . ఆస్ట్రియాలో ఓ నర్సు దీనివల్ల మరణించిందని, నార్వేలో ముగ్గురు  హెల్త్ వర్కర్లు తీవ్రంగా అస్వస్థులయ్యారని ఆ దేశ పత్రికలు పేర్కొన్నాయి.ఇప్పటికే ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో  మళ్ళీ లాక్ డౌన్ విధిస్తున్నారు. ఈ తరుణంలో ఆస్ట్రాజెనికా వంటి వ్యాక్సిన్లను నమ్మడం వల్ల ప్రయోజనం లేదని అంటున్నారు. ఐస్ ల్యాండ్ కూడా ఈ టీకామందును బ్యాన్ చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ, బ్రిటన్ కూడా ఇది సురక్షితమైనదని స్పష్టం చేస్తున్నాయి. కొంతమంది రోగులకు అలెర్జీ వంటిది వచ్చి ఉండవచ్చునని, బ్లడ్ క్లాటింగ్ కి, ఈ వ్యాక్సిన్ కి సంబంధం లేదని ఇవి పేర్కొంటున్నాయి.

ఇలా ఉండగా ఇండియాలో ఈ టీకామందు తీసుకున్నవారిలో ఎవరూ అస్వస్థులు కాలేదని, ఎవరికీ సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఆస్ట్రాజెనికా సంస్థ ప్రకటించింది. దీనిపై నిరాధారమైన వార్తలను విశ్వసించరాదని కోరింది. మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రాడక్ట్స్ రెగ్యులేటరీ ఏజన్సీ (ఎం హెచ్ ఆర్ ఏ) ఇదే విషయాన్ని స్ఫష్టం చేసింది. తాము ఇందుకు సంబంధించి వివిధ రిపోర్టులను పరిశిలీస్తున్నామని, కొన్ని లక్షలమంది ఈ టీకామందు డోసులు తీసుకున్నారని, కొందరిలో బ్లడ్ క్లాట్స్ సహజమని ఈ సంస్థ హెడ్ ఫ్రిల్ బ్రియాన్ తెలిపారు. అలాగే ఈ వ్యాక్సిన్ తీసుకున్న సుమారు 50 లక్షల మందిలో ఈ నెల  10 వరకు కేవలం 30 బ్లడ్ క్లాట్ కేసులు మాత్రమే వెల్లడయ్యాయని యూరోపియన్ మెడిసిన్ ఏజన్సీ ప్రకటించింది.

మరిన్ని ఇక్కడ చదవండి: Coronavirus: తిరుమల వేద పాఠశాలలో కరోనా కలకలం.. మరి కొంతమంది విద్యార్థులకు పాజిటివ్‌

Jasprit Bumrah wedding : టీవీ యాంకర్ తో ఏడడుగులు వేసిన పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా