AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devil Horns Grandmother : ప్రపంచంలోనే విచిత్ర మహిళ.. ఈ బామ్మాగారి నుదిటి మీద జంతువులా కొమ్ములు

  ఇప్పుడు ఈ బామ్మ బతికి ఉంటె 120 ఏళ్ళు పైగానే వయసు ఉంటుంది. అప్పటి ఫోటో ఒకటి కొమ్ముల బామ్మా అంటూ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హల్ చల్ చేస్తుంది. మరి మరణపురాణాల్లో...

Devil Horns Grandmother : ప్రపంచంలోనే విచిత్ర మహిళ.. ఈ బామ్మాగారి నుదిటి మీద జంతువులా కొమ్ములు
Horny Chinese Granny
Surya Kala
|

Updated on: Mar 16, 2021 | 1:50 PM

Share

Devil Horns Grandmother :  ఇప్పుడు ఈ బామ్మ బతికి ఉంటె 120 ఏళ్ళు పైగానే వయసు ఉంటుంది. అప్పటి ఫోటో ఒకటి కొమ్ముల బామ్మా అంటూ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హల్ చల్ చేస్తుంది. మరి మరణపురాణాల్లో రాక్షసుల నుదిటి మీద కొమ్ములుంటాయి.. మరి ఈ కొమ్ముల బామ్మ ఎవరు ఏమిటి తెలుసుకుందాం..! చైనాకు చెందిన ఒక వృద్ధ మహిళకు మేకను పోలినట్లు నుదిటి మీద కొమ్ము ఉంది. ఈ విషయం 2010 లో వెలుగులోకి వచ్చింది. ఈ అమ్మమ్మ కొమ్ము తన కుంటుంబానికే కాదు తోటి గ్రామస్థులకు కూడా షాక్ ఇచ్చింది. హెనాన్ ప్రావిన్స్‌లోని లిన్‌లౌ గ్రామానికి చెందిన రూయిఫాంగ్ అనే వృద్ధురాలు నుదుటి మీద కొమ్ము ఉన్న సంగతి ఆమె 101 వ ఏట బయటపడింది. అప్పటికి ఆ కొమ్ము దాదాపు 2. 4 ఇంచ్ పెరిగి ఆమె కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేసింది. సంవత్సరం మర్మమైన ప్రోట్రూషన్‌ను అభివృద్ధి చేయడం ప్రారంభించాడు.

ఈ బామ్మగారికి ఆమె ఆరుగురు కుమారులు, 60 ఏళ్ల జాంగ్ గుజోంగ్.. తన తల్లి నుదిటి పై ఏర్పాడిన కొమ్ము పై స్పందించారు. అమ్మ పెరిగిన కొమ్ము గురించి తాము మొదట్లో శ్రద్ధ పెట్టలేదని అన్నారు. అయితే రోజు రోజుకీ పెరిగిన కొమ్ము దాదాపు 6 సెంటి మీటర్లు పెరిగినట్లు మిస్టర్ జాంగ్ చెప్పారు. ఇక బామ్మ పెద్ద కుమారుడికి 82 సంవత్సరాలు.

అయితే ఈ కొమ్ము బామ్మా తన ఎడమ నుదిటిపై మొదటగా పెరిగింది. అనంతరం మళ్ళీ తర్వత రెండో వైపు పెరిగినట్లు చెప్పారు అయితే ఈ కొమ్ములు ఒకరమైన స్కిన్ ట్యూమర్ తో ఏర్పడతాయని వైద్య సిబ్బంది చెప్పారు. అయితే ఆ బామ్మకి తలపై కొమ్ములు ఉండడం ఇష్టమని చెప్పి మందులు వాడలేదని తెలుస్తోంది. దాదాపు 100 ఏళ్ళు దాటిన తర్వాత ఈ చైనా బామ్మా కొమ్ములు ప్రపంచానికి తెలిశాయి.

Also Read:

నెలకు 100 రూపాయలతో లక్షలు సంపాదించొచ్చు.. ఈ స్కీం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

మరణలోయలో కదిలే రాళ్లు.. రహస్యం కనిపెట్టేశామన్న శాస్త్రజ్ఞులు.. అయినా నమ్మని జనం