Indonesia Floods: ఇండోనేషియాను వణికిస్తున్న వరదలు.. 87కి పెరిగిన మృతుల సంఖ్య..

Indonesia East Timor Floods: ఇండోనేషియాను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశంలోని ఈస్ట్ తైమూర్‌లో వరదలు పోటెత్తడంతో పదుల సంఖ్యలో ప్రజలు మరణించగా..

Indonesia Floods: ఇండోనేషియాను వణికిస్తున్న వరదలు.. 87కి పెరిగిన మృతుల సంఖ్య..
Indonesia East Timor Floods
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 05, 2021 | 3:14 PM

Indonesia East Timor Floods: ఇండోనేషియాను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశంలోని ఈస్ట్ తైమూర్‌లో వరదలు పోటెత్తడంతో పదుల సంఖ్యలో ప్రజలు మరణించగా.. చాలామంది గల్లంతయ్యారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సోమవారం వరకూ మృతుల సంఖ్య 87కి పెరిగింది. ఇండోనేషియా తూర్పు తైమూర్ వరకు విస్తరించి ఉన్న ద్వీపాల్లో వరదలు అకస్మాత్తుగా విధ్వంసం సృష్టించాయి. దీంతోపాటు కొండచరియలు సైతం విరిగిపడ్డాయి.

వరదలతోపాటు కొండచరియలు విరిగిపడటంతో చాలామంది జాడ తెలియడంలేదని ఇండోనేషియా అధికారులు పేర్కొన్నారు. జల ప్రళయం వల్ల ఆనకట్టలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలన్నీ నీటమునిగాయని.. వేలాది మంది నిరాశ్రయులయ్యారని అధికారులు వెల్లడించారు. అయితే ఈ వరదల వల్ల ఇప్పటివరకూ 66 మంది మరణించారని.. సుమారు 100 మంది వరకూ తప్పిపోయినట్లు ఇండోనేషియా విపత్తు నిర్వహణ ఏజెన్సీ వెల్లడించింది. అయితే తూర్పు తైమూర్లో 21 మంది మరణించారని పేర్కొంది.

ఈ ప్రకృతి వినాశనంపై ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ప్రసంగించారు. విపత్తుల్లో మరణించిన వారికి ఆయన సంతాపం తెలిపారు. నిరాశ్రయులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నామని.. ఆహారం, వైద్య సేవలను అందిస్తున్నామని వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్‌ జరుగుతోందని వెల్లడించారు.

Also Read:

Deer Crash: వేగంగా వెళుతున్న స్కూల్ బస్ కిటికీలోంచి దూసుకొచ్చిన జింక..తర్వాత ఏం జరిగిందంటే?

Zoom Call: ముందూ వెనక చూసుకోకపోతే ఇలాగే ఉంటుంది.. జూమ్‌ కాల్‌లో ఊహించని పరిణామం.. తలపట్టుకున్న పొలిటీషియన్‌..

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?