Deer Crash: వేగంగా వెళుతున్న స్కూల్ బస్ కిటికీలోంచి దూసుకొచ్చిన జింక..తర్వాత ఏం జరిగిందంటే?

వేగంగా వెళుతున్న బస్సులో కిటికీ పక్క సీట్లో మీరు కూచున్నారు. ప్రయాణం మధ్యలో కునుకు తీశారు. ఇంతలో కిటికీ అద్దాలు పగలగొట్టుకుంటూ ఒక జింక మీపై వచ్చిపడింది. మీరేం చేస్తారు?

Deer Crash: వేగంగా వెళుతున్న స్కూల్ బస్ కిటికీలోంచి దూసుకొచ్చిన జింక..తర్వాత ఏం జరిగిందంటే?
Deer Crash
Follow us
Anil kumar poka

|

Updated on: Apr 05, 2021 | 2:06 PM

Deer Crash: వేగంగా వెళుతున్న బస్సులో కిటికీ పక్క సీట్లో మీరు కూచున్నారు. ప్రయాణం మధ్యలో కునుకు తీశారు. ఇంతలో కిటికీ అద్దాలు పగలగొట్టుకుంటూ ఒక జింక మీపై వచ్చిపడింది. మీరేం చేస్తారు? మీరే కాదు ఎవరైనా సరే హడలి పోతారు. మరి ఇటువంటి సంఘటన ఒక స్కూలు పిల్లవాడికి ఎదురైతే? ఏం జరిగిందంటే..

రోడ్డుమీద ఓ స్కూలు బస్సు వేగంగా వెళుతోంది.. ఇంతలో ఒక జింక కిటికీ అడ్డదాల్లోంచి బస్సులో పడింది. అదీ నిద్రపోతున్న ఒక విద్యార్థిపై. ఈ సంఘటన వర్జీనియాలో ఏప్రిల్ 1వ తేదీన జరిగింది. సంఘటన మొత్తం బస్సులోని సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

వర్జీనియాకు చెందిన బ్రెండాన్ మార్టిన్ (15) ఏళ్ల విద్యార్థి తన స్కూల్ బస్సులో స్కూల్ కి వెళుతున్నాడు. దారిలో నిద్రపోయాడు. ఇంతలో ఒక జింక కిటికీ అద్దాలు పగలగొట్టుకుంటూ మరీ బస్సులో వచ్చిపడింది. అదే వేగంతో నిద్ర పోతున్న మార్టిన్ మీద పడింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రనుంచి లేచిన ఆ విద్యార్ధి షాక్ తో నిలబడిపోయాడు.

సరిగ్గా ఇదే సమయంలో బస్సు డ్రైవర్ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. బస్సును మెల్లగా ఓ పక్కగా ఆపి బస్సు డోర్లు తెరిచాడు. దీంతో ఆ జింక డోర్ లోంచి వేగంగా దిగి పరిగెత్తింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలూ కాలేదు. అదేవిధంగా జింక కూడా క్షేమంగా వెళ్ళిపోయింది.

ఈ సంఘటనపై మార్టిన్ మాట్లాడుతూ ‘‘నాకు అలసటగా అనిపించి నిద్రపోయాను. ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. కళ్లు తెరిచి చూసే లోపే నా నడుం మీద ఏదో పడి ముందుకు తోసినట్లు అనిపించింది. ఒక జింక కంగారుగా పరిగెత్తింది. ఆ జింకను చూసి షాకయ్యాను’’ అని చెప్పాడు.

Also Read:సినిమాను సీన్ తలపిస్తున్న అద్భుతం సంఘటన… అవయవదానం చేస్తుండగా!:Brain Dead Man Comes video.

Rahul Gandhi: ‘నేను ప్రధానమంత్రి అయితే’.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?