Rahul Gandhi: ‘నేను ప్రధానమంత్రి అయితే’.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
Rahul Gandhi interaction with Nicholas Burns: యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించే వృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం రాహుల్ గాంధీ
Rahul Gandhi interaction with Nicholas Burns: యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించే వృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం రాహుల్ గాంధీ అమెరికా మాజీ స్టేట్ సెక్రటరీ, హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ ప్రొఫెసర్ నికొలస్ బర్న్స్‌తో వర్చువల్ ద్వారా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ నికోలస్.. అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ ఆసక్తికర సమాధానమిచ్చారు. ఒకవేళ మీరు భారత్‌కు ప్రధానమంత్రి అయితే.. ఏం చేస్తారంటూ నికోలస్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాను ప్రధానమంత్రి అయితే వృద్ధి కేంద్రంగా అమలవుతున్న విధానాల కన్నా.. యువతకు ఉద్యోగాలను సృష్టించే విధానాలపై ఎక్కువ దృష్టిసారిస్తానని పేర్కొన్నారు. అభివృద్ధి అనేది దేశానికి అవసరమైనప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు. దేశంలో నిరుద్యోగం ఎక్కువగా పెరిగిపోయింది. అసలు వృద్ధికి, ఉద్యోగ కల్పనకు సంబంధం లేకుండా అభివృద్ధి ఉంది. అందుకు ప్రస్తుతం అమలవుతున్న విధానాలేనని రాహుల్ తెలిపారు.
చైనాలో ఉద్యోగ కల్పన లాంటి సమస్యలు లేవని గుర్తుచేశారు. ఆ దేశంలో ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పే చైనా నేత.. ఇప్పటివరకు కనిపించలేదన్నారు. వృద్ధి రేటు 9 శాతం ఉండడం కంటే దానికి తగ్గట్లుగా ఉద్యోగాల కల్పన జరగడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. అసలు ఉద్యోగాల కల్పన లేని వృద్ధి రేటు ఎందుకు పనికిరాదని స్పష్టంచేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తోందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అసలు ఎన్నికల్లో పోటీ చేయాలంటే దేశంలో మౌలిక వ్యవస్థలు ఉండాలని.. ఆ వ్యవస్థలకు న్యాయ వ్యవస్థ నుంచి రక్షణ ఉండాలని.. మీడియాకు స్వేచ్ఛ కల్పించాలని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు న్యాయమైన రాజకీయ పోరాటానికి మద్దతిస్తాయని అందరూ భావిస్తారని, అలాంటి ప్రతిపక్షాలు 2014 తర్వాత ఆ పనిని ఏమాత్రం చేయలేకపోతున్నాయన్నారు. దీనిలో కాంగ్రెస్ మాత్రమే లేదని.. బీఎస్‌పీ, ఎస్‌పీ, ఎన్‌సీపీ, తదితర పార్టీలు కూడా ఏ ఎన్నికల్లోనూ గెలవడం లేదని చెప్పారు. ప్రస్తుతం భారత దేశంలో వ్యవస్థలన్నీ సక్రమంగా లేవని స్పష్టంచేశారు. బీజేపీ తీరును చాలా మంది విశ్వసించడం లేదని.. అలాంటి వారిని ఏకతాటిపైకి తేవాలని అభిప్రాయపడ్డారు.
Also Read: