Coronavirus: డీఎంకే నాయకురాలు, ఎంపీ కనిమొళికి కరోనా.. ఆందోళనలో పార్టీ శ్రేణులు
Tamil Nadu Election 2021: తమిళనాడులో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. పదేళ్లు అధికారానికి దూరమైన పార్టీని ఎలాగైనా.. గట్టెక్కించాలని
Tamil Nadu Election 2021: తమిళనాడులో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. పదేళ్లు అధికారానికి దూరమైన పార్టీని ఎలాగైనా.. గట్టెక్కించాలని డీఎంకే శ్రమిస్తోంది. ఓ వైపు ఎంకే స్టాలిన్, మరోవైపు కనిమొళి ప్రణాళికలు రచిస్తూ.. ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కనిమొళి అనారోగ్యానికి గురికావడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. డీఎంకే స్టార్ క్యాంపెయినర్ కనిమొళి కరోనావైరస్ బారిన పడ్డారు. తాజాగా ఆమె కరోనా పరీక్షలు చేయించుకోగా కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నారని పార్టీ నేతలు పేర్కొన్నారు. దాంతో ఎన్నికల ప్రచారంతో సహా అన్ని కార్యక్రమాలను కనిమొళి రద్దు చేసుకున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం కనిమొళి తూత్తుకుడి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తన సోదరుడు డీఎంకే అధినేత స్టాలిన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు కనిమొళి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ.. కనిమొళి కరోనా బారిన పడటంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 6 న ఒకే దశలో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 2 న జరుగుతుంది.
తమిళనాడులో కరోనావైరస్ విజృంభిస్తోంది. రెండో దశలో రోజూ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతేడాది అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రం అంతటా ఆందోళన నెలకొంది. తాజాగా శనివారం తమిళనాడులో 3,446 కోరోనా కేసులు నమోదయ్యాయి. 14 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,204 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: