AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zoom Call: ముందూ వెనక చూసుకోకపోతే ఇలాగే ఉంటుంది.. జూమ్‌ కాల్‌లో ఊహించని పరిణామం.. తలపట్టుకున్న పొలిటీషియన్‌..

Zoom Call: కరోనా కారణంగా వర్చ్వూవల్‌ లైఫ్‌ స్టైల్‌ బాగా పెరిగిపోయింది. ఉద్యోగాల కోసం జరిగే ఇంటర్వ్యూల నుంచి టీవీ చర్చల వరకు అన్నీ ఆన్‌లైన్‌...

Zoom Call: ముందూ వెనక చూసుకోకపోతే ఇలాగే ఉంటుంది.. జూమ్‌ కాల్‌లో ఊహించని పరిణామం.. తలపట్టుకున్న పొలిటీషియన్‌..
Amabarsing Moment In Zoom C
Narender Vaitla
|

Updated on: Apr 05, 2021 | 1:44 PM

Share

Zoom Call: కరోనా కారణంగా వర్చ్వూవల్‌ లైఫ్‌ స్టైల్‌ బాగా పెరిగిపోయింది. ఉద్యోగాల కోసం జరిగే ఇంటర్వ్యూల నుంచి టీవీ చర్చల వరకు అన్నీ ఆన్‌లైన్‌ వేదికగానే జరుగుతున్నాయి. అయితే మన పనిని సులువు చేసిన ఈ టెక్నాలజీనే కొన్ని సందర్భాల్లో తలనొప్పిగా కూడా మారుతుంది. తాజాగా ఇలాంటి ఊహించని ఘటన ఒకటి సౌతాఫ్రికాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సౌతాఫ్రికాలో కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఓ టీవీ ఛానల్‌ చర్చ ఏర్పాటు చేసింది. ఈ చర్చా కార్యక్రమంలో గ్జోలివే డేవు అనే ఓ నేత తన ఇంటి నుంచి జూమ్‌ కాల్‌లో పాల్గొన్నాడు. ఈ చర్చలో గ్జోలిలేతో పాటు మరో 22 మంది నేతలు పాల్గొన్నారు. చర్చ జోరుగా సాగుతోన్న సమయంలో అనుకోకుండా గ్జోలిలే భార్య అప్పుడే బాత్‌రూమ్‌ నుంచి స్నానం చేసిన వచ్చింది. అయితే ఆ సమయంలో ఆమె ఒంటిపై నూలు పోగు కూడా లేకపోవడం గమనార్హం. దీంతో జూమ్‌ కాల్‌లో ఉన్న మిగతా సభ్యులు కంగుతిన్నారు. వెంటనే గ్జోలిలేను మందలిస్తూ.. ‘అందరూ చూస్తున్నారు. సమావేశంలో ఉన్నారనే విషయాన్ని మీరు మీ భార్యకు చెప్పలేదా.?’ అని ఓ ప్రతినిధి అనడంతో ఒక్కసారిగా షాక్‌ అయిన గ్జోలిలే తన భార్యను అలర్ట్‌ చేశాడు. ఇలా జూమ్‌ కాల్‌ ద్వారా చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఈ విషయమై సభ్యులకు క్షమాపణలు చెప్పిన గ్జోలిలే తన దృష్టి కెమెరాపైనే ఉందని, వెనక ఏం జరుగుతుందో చూడలేదని మరుసటి రోజు సమావేశంలో చెప్పుకొచ్చాడు. చూశారుగా వీడియో కాల్‌తో ఎన్ని లాభాలు ఉన్నాయో అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచైనా వీడియో కాల్‌లో మాట్లాడుతున్నప్పుడు వెనకా ముందు ఏం జరుగుతుందో చూసుకొని మాట్లాడితే అందరికీ మంచిది.

Also Read: Bernard Taupie: అర్థరాత్రి బీభత్సం… మాజీ మంత్రిని తాళ్లతో కట్టేసి దుండుగల దాడి.. భారీగా చోరీ

LG Smart Phones: మూతపడిన ఎల్జీ స్మార్ట్ ఫోన్ డివిజన్..నష్టాలతో మార్కెట్ల నుంచి కనుమరుగవుతున్నపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్!

Adivi Sesh’s Major: ఆసక్తి పెంచుతున్న అడివి శేష్ సినిమా.. మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ పాత్రలో కనిపించనున్న యంగ్ హీరో..