AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adivi Sesh’s Major: ఆసక్తి పెంచుతున్న అడివి శేష్ సినిమా.. మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ పాత్రలో కనిపించనున్న యంగ్ హీరో..

మేజ‌ర్ చిత్రంలోని క్యారెక్టర్ పోస్టర్‌లో మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ మ‌రియు అడివి శేష్ ల మ‌ధ్య సారూప్యతలతో ఈ చిత్రంపై భారీ

Adivi Sesh's Major: ఆసక్తి పెంచుతున్న అడివి శేష్ సినిమా.. మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ పాత్రలో కనిపించనున్న యంగ్ హీరో..
Major Poster
Rajeev Rayala
|

Updated on: Apr 05, 2021 | 1:38 PM

Share

Adivi Sesh’s Major: మేజ‌ర్ చిత్రంలోని క్యారెక్టర్ పోస్టర్‌లో మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ మ‌రియు అడివి శేష్ ల మ‌ధ్య సారూప్యతలతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ రోజు ఈ మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న న‌టి ‌సాయి మంజ్రేకర్ ఫ‌స్ట్ గ్లిమ్స్‌ని విడుద‌ల‌చేసిన చిత్ర యూనిట్‌. మేజ‌ర్ మూవీ టీజ‌ర్‌ను ఏప్రిల్ 12న ఆవిష్క‌రించ‌నున్న‌ట్లు తెలిపారు మేకర్స్‌. ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్ యూనిఫామ్‌లో సాయి మంజ్రేకర్ మరియు ఆడివి శేష్ ఉన్న ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. అలాగే డిఫెన్స్ అకాడమికి సెల‌క్ట్ అయినందుకు లెట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెల‌ప‌డం ఈ పోస్ట‌ర్లో చూపించారు.

టీనేజ్ నుండి యుక్తవయసు వరకు వైవిధ్యమైన దశలలో అడివి శేష్‌తో పాటు సాయి మంజ్రేకర్ పాత్ర మ‌న‌కి క‌నిపిస్తోంది. తొలి చిత్రం ‘దబాంగ్ 3’ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తరువాత సాయి మంజ్రేకర్ తెలుగులో న‌టిస్తోన్న మొద‌టి చిత్ర‌మిది. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ చిత్రం తెరకెక్కుతోంది. శౌర్యం మరియు ధైర్యానికి పేరుగాంచిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ చనిపోయిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం యొక్క ఆత్మను సంగ్రహించి మేజర్ సందీప్ జీవితాన్నిసెల‌బ్రేట్ చేయ‌డ‌మే ఈ చిత్రం యెక్క ముఖ్య ఉద్దేశం. తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్ల‌స్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన `మేజర్` చిత్రం జులై2 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కాబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

‘ఆర్ఎక్స్’ 100 హీరోకు ఈ సినిమా అయిన సక్సెస్ తెచ్చిపెట్టేనా.. కొత్త సినిమా మొదలు పెట్టిన కార్తికేయ

Follow Us
ఇదెక్కడి బౌలింగ్ సామీ.. టీ20 వరల్డ్ కప్‌లో సరికొత్త మైలురాయి..
ఇదెక్కడి బౌలింగ్ సామీ.. టీ20 వరల్డ్ కప్‌లో సరికొత్త మైలురాయి..
రక్షణ నుంచి అంతరిక్షం వరకు.. మన బంధం చెక్కుచెదరనిది.. మోదీ
రక్షణ నుంచి అంతరిక్షం వరకు.. మన బంధం చెక్కుచెదరనిది.. మోదీ
కాసేపయ్యాక వేళ్దాంలే అని మూత్రం ఆపుకుంటున్నారా? ఈ వార్నింగ్ మీకే!
కాసేపయ్యాక వేళ్దాంలే అని మూత్రం ఆపుకుంటున్నారా? ఈ వార్నింగ్ మీకే!
నీళ్లు పడుతుండగా మూలన అదేపనిగా చప్పుళ్లు..
నీళ్లు పడుతుండగా మూలన అదేపనిగా చప్పుళ్లు..
బాత్రూమ్‌లో స్మార్ట్‌ఫోన్ అలవాటు ఉందా? ఈ ఆరోగ్య సమస్యలు మీవెంటే!
బాత్రూమ్‌లో స్మార్ట్‌ఫోన్ అలవాటు ఉందా? ఈ ఆరోగ్య సమస్యలు మీవెంటే!
మొన్నటివరకు టాలీవుడ్ హీరోయిన్.. ఇప్పుడు UK కంపెనీ డైరెక్టర్
మొన్నటివరకు టాలీవుడ్ హీరోయిన్.. ఇప్పుడు UK కంపెనీ డైరెక్టర్
విరోషి పెళ్లి వేడుకలో టాప్‌ 9 విశేషాలు..
విరోషి పెళ్లి వేడుకలో టాప్‌ 9 విశేషాలు..
జింబాబ్వేతో కీలక పోరుకు భారత్ రెడీ.. ఓడితే టోర్నీ నుంచి ఔట్
జింబాబ్వేతో కీలక పోరుకు భారత్ రెడీ.. ఓడితే టోర్నీ నుంచి ఔట్
మీరు గంటల తరబడి కూర్చొని పనిచేస్తున్నారా..? ఇది తప్పక తెలుసుకోండి
మీరు గంటల తరబడి కూర్చొని పనిచేస్తున్నారా..? ఇది తప్పక తెలుసుకోండి
భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య కీలక ఒప్పందాలు.. పూర్తి వివరాలు ఇవే!
భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య కీలక ఒప్పందాలు.. పూర్తి వివరాలు ఇవే!