‘ఆర్ఎక్స్’ 100 హీరోకు ఈ సినిమా అయిన సక్సెస్ తెచ్చిపెట్టేనా.. కొత్త సినిమా మొదలు పెట్టిన కార్తికేయ

కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఆదిరెడ్డి. టి సమర్పణ లో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై 88 రామారెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.

'ఆర్ఎక్స్' 100 హీరోకు ఈ సినిమా అయిన సక్సెస్ తెచ్చిపెట్టేనా.. కొత్త సినిమా మొదలు పెట్టిన కార్తికేయ
Karthikeya Gummakonda
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 05, 2021 | 1:36 PM

Karthikeya Gummakonda: కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఆదిరెడ్డి. టి సమర్పణ లో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై 88 రామారెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. తాన్యా రవిచంద్రన్ ఇందులో కథానాయిక. సుధాకర్ కోమాకుల ప్రత్యేకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ-‘’ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇందులో కార్తికేయ ఎన్. ఐ. ఎ. ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఆయన పాత్ర ఫుల్ ఎనర్జీ తో ఉంటుంది. తమిళంలో విజయ్ సేతుపతి సరసన ‘కరుప్పన్’ లో నటించి, ప్రస్తుతం అదర్వ మురళి తో చేస్తున్న తాన్యా రవిచంద్రన్ ని ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాం అని అన్నారు. ఆమె మంచి క్లాసికల్ డాన్సర్ అని తెలిపారు. ఇక లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఫేమ్ సుధాకర్ కోమాకుల ప్రత్యేకపాత్రలో నటిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రం ప్రస్తుతం షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ’మెంటల్ మధిలో’, ’దొరసాని’,’అంతరిక్షం’ చిత్రాలకు స్వరాలందించిన ప్రశాంత్. ఆర్. విహారి ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

కాగా ఆర్ ఎక్స్ 100 సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కార్తికేయ ఆతర్వాత హీరోగా కంటిన్యూ అవుతూనే నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా కనిపించి మెప్పించాడు. ఇటీవల చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక పోయింది.మరి ఈ కుర్ర హీరో ఈ సినిమాతోనైనా తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashmika Mandanna Birthday: దక్షిణాది క్రేజీ హీరోయిన్ .. కన్నడ సోయగం రష్మిక మందన్నా పుట్టిన రోజు నేడు..

Republic Movie Teaser: ‘ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో..లేదా అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం’.. రిపబ్లిక్ టీజర్

Ariyana Glory : ఇక పై కనిపించను.. అర్థం చేసుకోండి.. అరియానా కామెంట్స్ వైరల్ వీడియో..