Bernard Taupie: అర్థరాత్రి బీభత్సం… మాజీ మంత్రిని తాళ్లతో కట్టేసి దుండుగల దాడి.. భారీగా చోరీ

Bernard Taupie:  ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త, మాజీ మంత్రి, మిలియనీర్‌ బెర్నార్డ్‌ టాపీ (78)కి పెద్ద ప్రమాదం తప్పింది. అడిడాస్‌ మాజీ యజమాని టాపీ ఇంటిపై దొంగలు...

Bernard Taupie: అర్థరాత్రి బీభత్సం... మాజీ మంత్రిని తాళ్లతో కట్టేసి దుండుగల దాడి.. భారీగా చోరీ
Former Adidas Owner Bernard Taupie,
Follow us

|

Updated on: Apr 05, 2021 | 12:17 PM

Bernard Taupie:  ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త, మాజీ మంత్రి, మిలియనీర్‌ బెర్నార్డ్‌ టాపీ (78)కి పెద్ద ప్రమాదం తప్పింది. అడిడాస్‌ మాజీ యజమాని టాపీ ఇంటిపై దొంగలు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఈ సందర్భంగా టాపీ దంపతులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టాపీతో పాటు ఆయన భార్య డొమినిక్‌ కూడా గాయాల పాలయ్యారు.. అయితే డొమినిక్‌ టాపీ ఎలాగోలా తప్పించుకుని పొరుగువారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పారిస్‌ సమీపంలోని కాంబ్స్‌-లా విల్లేలోని ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ కన్నుగప్ఇ విలాసవంతమైన మౌలిన్‌ డి బ్రూయిల్‌ భవనం మొదటి అంతస్తులోని కిటికీ గుండా నగులురు వ్యక్తులు చొరబడ్డారు. అనంతరం బెర్నార్డ్‌ టాపీ దంపతులను ఎలక్ట్రికల్‌ తాళ్లతో కట్టేసి దాడికి పాల్పడ్డారు. అయితే ఇద్దరు స్వల్ప గాయాలతో బయట పడ్డారని టాపీ మనవడు రోడోల్ఫ్‌ టాపీ తెలిపారు. అతి ఖరీదైన రోలెక్స్‌ వాచీలు, ఇతర డైమండ్‌ అభరణాలను చోరీ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. దాడి అనంతరం వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా, 1992లో ఫ్రాంకోయిస్‌ మిట్టర్‌రాండ్‌ ప్రభుత్వంలో కొంతకాలం పట్టణ వ్యవహారాల మంత్రిగా పని చేసిన టాపీ కెరీర్‌ ప్రారంభంలో వివాదాల్లో చిక్కుకున్న సంస్థలను కొనుగోలు చేసి క్రీడా, మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆ తర్వాత అవినీతి, పన్ను మోసం, కార్సొరేట్‌ ఆస్తులను దుర్వినియోగం లాంటి కేసులలో దోషిగా తేలాడు. ఈ కేసు అప్పటి ఆర్థిక మంత్రి క్రిస్టిన్‌ లాగార్డ్‌ మెడకు కూడా చుట్టుకోవడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఐదు నెలల శిక్ష తర్వాత 1997లో జైలు నుంచి విడుదలయ్యాడు. దీనికి తోడు 1993లో అడిడాస్ స్పోర్ట్స్ అపెరల్ కంపెనీలో తన వాటాను ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఫ్రెంచ్ బ్యాంక్ క్రెడిట్ లియోనైస్‌కు విక్రయించడం పెద్ద దుమారమే సృష్టించింది.

ఈ ఆరోపణలు కొనసాగుతుండగానే 20123లో దక్షిణ ఫ్రెంచ్‌ దినపత్రిక లా ప్రోవెన్స్‌, ఇతర పత్రికలను స్వాధీనం చేసుకుని మీడియా బాస్‌గా అవతరించాడు. అనంతరం ఫ్రాన్స్‌ టాప్‌ ఫుడ్‌బాల్ లీగ్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా 400 మిలియన్ యూరోల విలువైన (సుమారు 470 మిలియన్ డాలర్లు) అతిపెద్ద కుంభకోణం కేసులో విచారణను ఎదుర్కుంటున్నాడు. అయితే టాపీ అనారోగ్యం కారణంగా విచారణ వాయిదా పడింది. ఈ ఏడాది మే నెలలో ఈ కుంభకోణంపై విచారణ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి: జోర్డాన్‌ రాజ కుటుంబంలో ముసలం.. దేశద్రోహం కేసులో గృహ నిర్బంధంలో మాజీ యువరాజు..!

Robot artist: ఏం క్రియేటివిటి గురూ.. ఈ రోబో వేసిన పెయింటింగ్‌ ఎంత ధర పలికిందో తెలిస్తే షాకవుతారు..!