Robot artist: ఏం క్రియేటివిటి గురూ.. ఈ రోబో వేసిన పెయింటింగ్‌ ఎంత ధర పలికిందో తెలిస్తే షాకవుతారు..!

Robot Artist Sells: ప్రపంచ ప్రఖ్యాత రోబో సోఫియా బహుముఖ ప్రజ్ఞాశాలి. సోఫియా చక్కగా మాట్లాడుతుంది. ‘చిత్రకళ’లోనూ నైపుణ్యం ఉంది. అందుకే సోఫియా సృష్టించిన...

Robot artist: ఏం క్రియేటివిటి గురూ.. ఈ రోబో వేసిన పెయింటింగ్‌ ఎంత ధర పలికిందో తెలిస్తే షాకవుతారు..!
Robot Artist
Subhash Goud

|

Apr 04, 2021 | 10:38 AM

Robot Artist Sells: ప్రపంచ ప్రఖ్యాత రోబో సోఫియా బహుముఖ ప్రజ్ఞాశాలి. సోఫియా చక్కగా మాట్లాడుతుంది. ‘చిత్రకళ’లోనూ నైపుణ్యం ఉంది. అందుకే సోఫియా సృష్టించిన ‘డిజిటల్‌ ఆర్ట్‌వర్క్‌’ వేలం పాటలో 6,88,888 డాలర్లు (రూ.5.5 కోట్లు) పలికింది. ఇది నాన్‌-ఫంజిబుల్‌ టోకెన్‌ (NFT) రూపంలో అమ్ముడుపోయింది. హాంకాంగ్‌కు చెందిన డేవిడ్‌ హాన్సన్‌ సృష్టించిన సోఫియా సంగీత సాధనపై దృష్టి పెట్టింది.

ఈ రోబోను ఎవరు సృష్టించారు…

ప్రపంచంలో పౌరసత్వం పొందిన మొట్టమొదటి ఫీమేల్ రోబోట్ సోఫియాను. హాంకాంగ్‌కు చెందిన హాన్సన్ రోబోటిక్స్ ఈ రోబోట్ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ ఫీమేల్ రోబోను 2016 ఫిబ్రవరి 14న ఆవిష్కరించారు. ఆ తర్వాత టెక్సాస్లోని ఆస్టిన్ సౌత్ వెస్ట్ ఫెస్టివల్‌లో దీన్ని మొదటిసారిగా ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ఈ రోబోటిక్‌ మాట్లాడుతుంది… నృత్యం చేస్తుంది. పాటలు పడుతుంది. అందరిని నవ్విస్తుంది. ఇలాంటి ఎన్నో రకాలుగా అందరిని ఆకర్షిస్తున్న ఈ రోబో.. చాలా రకాలుగా స్పందిస్తుంది. వింటుంది, ఆలోచిస్తుంది, మనిషితో మనిషిలానే మాట్లాడుతుంది. మనిషిలానే సందర్భానికి తగ్గట్లు ముఖభావాలను వ్యక్తం చేస్తుంది. భుజాలను సైతం ఎగరేస్తుంది. అంతేకాదు నడుస్తుంది.. కూర్చుంటుంది.. ఇలా అన్ని విధాలుగా ప్రదర్శిస్తుంది.

రోబోకు మరిన్ని ‌ప్రత్యేతలు..

అంతే కాదు.. సోఫియాకు ‘సోఫియా థీ రోబోట్’ పేరుతో ప్రత్యేకమైన ట్విట్టర్ ప్రొఫైల్ కూడా ఉంది. ఈ ఖాతా నుంచి కొత్త అప్‌డేట్స్ అందిస్తుంది. ఇక సోఫియా 50 కంటే ఎక్కువ ముఖ కవళికలను ప్రదర్శించగలదు. అంతేకాదండోయ్‌.. ఇది సునాయాసంగా ప్రసంగించగలదు. ఈ రోబో ఇదివరకే అనేక సమావేశాలలో కనిపించి అనేక పత్రికా సమావేశాల్లో కూడా మాట్లాడింది. 2019 అక్టోబర్‌లోఇండోర్‌లో జరిగిన అంతర్జాతీయ రౌండ్ స్క్వేర్ సమావేశానికి సోఫియా హాజరై వాతావరణ మార్పు, ఇంధన పరిరక్షణపై ప్రసంగించి అందరు ఆశ్యర్యపడేలా చేసింది. ఇలా ఈ రోబోకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

డేవిడ్‌ హాన్సన్‌ ఏమన్నారంటే..

తాను సృష్టించిన ఈ రోబో ప్రజలతో మమేకం అవుతుందని, ఆస్పత్రుల్లో, పరిశ్రమలలో, ఇతర సంస్థల్లో ఈ రోబో ఎంతగానో సహాయపడుతుందని రోబోను సృష్టించిన డేవిడ్‌ హాన్సన్‌ అన్నారు. ఇది మనుషులకంటే వేగంగా స్పందిస్తుందని చెప్పారు.

చాలామంది పెట్టుబడి పెడుతున్నారు…

ఇలాంటి వీడియోలను తయారుచేసే చాలామంది వ్యక్తులకు డబ్బు అవసరం, కానీ ఎక్కువమంది ఇలాంటి వాటిలో  కూడా పెట్టుబడి పెడతారు. ఎందుకంటే ఎన్‌ఎఫ్‌టిలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై వ్యూస్ దక్కించుకుంటాయి. ఎవరైనా వాటిని ఇష్టపడితే, చేసినవారు వాటి ద్వారా కోట్లు సంపాదించవచ్చు. బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీ ఇటువంటి వీడియోలను డూప్లికేట్ కాకుండా చూస్తుంది.

ఇవీ చదవండి: ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!

Golden Residency: యూఏఈ ఆరు నెలల వీసాకు శ్రీకారం… ఈ వీసా పొందేందుకు ఎవరెవరు అర్హులంటే..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu