Golden Residency: యూఏఈ ఆరు నెలల వీసాకు శ్రీకారం… ఈ వీసా పొందేందుకు ఎవరెవరు అర్హులంటే..!
Golden Residency: గోల్డెన్ రెసిడెన్సీ దరఖాస్తుదారుల కోసం యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్ ఆరు నెలల గడువుతో వీసా సర్వీసులను...
Golden Residency: గోల్డెన్ రెసిడెన్సీ దరఖాస్తుదారుల కోసం యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్ ఆరు నెలల గడువుతో వీసా సర్వీసులను తీసుకొచ్చింది. ఈ వీసా మల్టీపుల్ ఎంట్రీని కూడా కల్పిస్తోంది.గోల్డెన్ రెసిడెన్సీకి సంబంధించిన అన్ని విధానాలను పూర్తి చేయడానికి వీలు కల్పించే ఉద్దేశంతో ఈ ఆరు నెలల వీసా సర్వీసుకు యూఏఈ శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఇది చాలాసార్లు ప్రయాణించే వారికి ప్రయోజనం చేకూరనుంది. ఇక ఈ వీసా ఖరీదును 1150 దిర్హమ్స్(సుమారు రూ.23వేలు)గా అథారిటీ ఖరారు చేసింది.కేవలం గోల్డెన్ రెసిడెన్సీ విధానాన్ని పూర్తి చేసే కారణంతో తీసుకొచ్చిన ఆరు నెలల వీసాకు ఎవరు అర్హులు ఎవరంటే..
► ప్రభుత్వ పెట్టుబడులు లేదా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిదారులు
► వ్యవస్థాపకులు
► పీహెచ్‌డీ హోల్డర్స్
► వైద్యులు, శాస్త్రవేత్తలు
► ఆవిష్కర్తలు
► సంస్కృతి, కళలో సృజనాత్మక నిపుణులు
► ప్రాధాన్యత గల శాస్త్రీయ రంగాలలోని నిపుణులు
►అథ్లెట్స్
► ఇంజనీరింగ్, సైన్స్ నిపుణులు (ఎపిడెమియాలజీ మరియు వైరస్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, ప్రోగ్రామింగ్, ఎలక్ట్రికల్, జెనెటిక్స్, బయోటెక్నాలజీ)
► అత్యుత్తమ విద్యార్థులు (ఉన్నత పాఠశాల లేదా విశ్వవిద్యాలయం)
ఇవీ చదవండి: India – Pakistan Trade: భారత్ నుంచి షుగర్, కాటన్ దిగుమతులపై పాక్ ప్రధాని కీలక ప్రకటన
US Capitol: యూఎస్ క్యాపిటల్ భవనం వద్ద మళ్లీ అలజడి.. బారికేడ్లపై దూసుకెళ్లిన కారు.. ఓ అధికారి మృతి
Mrbeast Coffin Video: 50 గంటల పాటు సజీవ సమాధి.. యూట్యూబర్ స్టంట్.. చివరకు ఏమైందంటే..?