Mrbeast Coffin Video: 50 గంట‌ల పాటు స‌జీవ స‌మాధి.. యూట్యూబ‌ర్ స్టంట్‌.. చివరకు ఏమైందంటే..?‌

ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ మిస్ట‌ర్ బీస్ట్ చేసిన ఓ స్టంట్ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారుతోంది. ఏకబిగిన 50 గంట‌ల పాటు స‌జీవ స‌మాధి అయ్యాడు.

Mrbeast Coffin Video:  50 గంట‌ల పాటు స‌జీవ స‌మాధి.. యూట్యూబ‌ర్ స్టంట్‌.. చివరకు ఏమైందంటే..?‌
Mister Beast In Coffin
Follow us

|

Updated on: Apr 03, 2021 | 10:53 AM

Mrbeast Videos: ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ మిస్ట‌ర్ బీస్ట్ చేసిన ఓ స్టంట్ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారుతోంది. ఏకబిగిన 50 గంట‌ల పాటు స‌జీవ స‌మాధి అయ్యాడు. ఓ శ‌వ‌పేటిక‌లో అత‌న్ని ఉంచి భూమిలో పాతి పెట్టారు. జిమ్మీ డొనాల్డ్‌స‌న్ అనే ఈ యూట్యూబ‌ర్ త‌న 5.75 కోట్ల మంది సబ్‌స్క్రైబ‌ర్ల‌ను అల‌రించ‌డానికి ఇలా వింత వింత వీడియోల‌ను చేస్తూనే ఉంటాడు. తాజాగా పెద్ద సాహ‌స‌మే చేశాడు. ఏకంగా రెండు రోజుల పాటు భూమిలో శవపేటికలో ఉండి తర్వాత స‌జీవంగా బయటికొచ్చాడు . దీనికి సంబంధించిన 12 నిమిషాల వీడియోను త‌న చానెల్‌లో మిస్ట‌ర్ బీస్ట్ పోస్ట్ చేశాడు.

కేవ‌లం నాలుగు రోజుల్లోనే ఈ వీడియోను 5 కోట్ల మందికిపైగా చూసారు. రెండు రోజుల పాటు అత‌డు ఆ శ‌వ‌పేటిక‌లోనే ప‌డుకుని ఉన్నాడు. తిన‌డానికి కొంత ఆహారంతోపాటు అత‌ని క‌ద‌లిక‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు రికార్డు చేయ‌డానికి చుట్టూ కెమెరాలు ఏర్పాటు చేశారు. బ‌య‌టి నుంచి ఆక్సిజ‌న్‌ను శ‌వ‌పేటిక‌లోకి పంపారు. అత్య‌వ‌స‌ర‌మైతే చికిత్స అందించ‌డానికి డాక్ట‌ర్‌ను కూడా సిద్ధంగా ఉంచారు. యూట్యూబ్‌లో మిస్ట‌ర్ బీస్ట్‌ పోస్ట్ చేసే ప్ర‌తి వీడియోను 2 కోట్ల మందికిపైగా చూస్తారు. “సంపాదించిన దాంట్లో కొన్ని లక్షల డాలర్లు ఇప్పటికే విరాళంగా ఇచ్చాడు. ఫాన్స్‌ని అలరించడానికి వింత చేష్టలు చేసే మిస్టర్ బీస్ట్ చాలా కూల్‌” అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం ఇలాంటి పిచ్చిపనులు కరెక్ట్ కాదని సూచిస్తున్నారు. పబ్లిసిటీ కోసం, వ్యూస్ కోసం ప్రాణాలతో చెలగాటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అటు ఫ్టస్, ఇటు మైనస్.. మొత్తానికి మాంచి పబ్లిసిటీ అయితే దక్కింది మిస్ట‌ర్ బీస్ట్‌కు.

Also Read: అద్భుతం జరిగింది.. బ్రెయిన్ డెడ్ అయిన యువకుడిని అవయవధానం కోసం తీసుకెళ్తుండగా…

తిరుమల వెంకన్న భక్తులకు శుభవార్త.. గదుల కోసం ఇకపై వెయిటింగ్‌కు చెక్