AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్భుతం జరిగింది.. బ్రెయిన్ డెడ్ అయిన యువకుడిని అవయవధానం కోసం తీసుకెళ్తుండగా…

వైద్యులు ఎవరైనా చనిపోయినట్లు ప్రకటిస్తే, ఆ వ్యక్తి కుటుంబంలో ఎంతటి విషాదం నెలకుంటుందో ప్రత్యేకంగా చెప్పలేము. అలా విషాదంలో మునిగిపోయిన ఫ్యామిలీలో...

అద్భుతం జరిగింది.. బ్రెయిన్ డెడ్ అయిన యువకుడిని అవయవధానం కోసం తీసుకెళ్తుండగా...
Breath Of Life Moment
Ram Naramaneni
|

Updated on: Apr 03, 2021 | 10:33 AM

Share

వైద్యులు ఎవరైనా చనిపోయినట్లు ప్రకటిస్తే, ఆ వ్యక్తి కుటుంబంలో ఎంతటి విషాదం నెలకుంటుందో ప్రత్యేకంగా చెప్పలేము. అలా విషాదంలో మునిగిపోయిన ఫ్యామిలీలో ఒక్కసారిగా ఆనందపు హోరు మొదలయ్యింది. మేము చెప్పబోయే ఈ సంఘటన ఏ సినిమా స్టోరీనో కాదు.. పూర్తి నిజం. బ్రిటన్లో ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది.  అక్కడ అవయవ దానం కోసం ఆపరేషన్ సన్నాహాలు జరుగుతున్న సమయంలో బ్రైయిన్ డెడ్ అయిన యువకుడు అకస్మాత్తుగా స్పందించడం ప్రారంభించాడు.

వివరాల్లోకి వెళ్తే.., ఈ కేసు యూకేలోని లీక్ నగరంలో జరిగింది. అక్కడ నివశించే లూయిస్ రాబర్ట్స్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ, అతని స్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. నాలుగు రోజుల తరువాత, వైద్యులు అతన్ని బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. ఆర్గాన్ డొనేషన్ కోసం కుటుంబ సభ్యులను ఒప్పించారు.

అవయవ దానం ఆపరేషన్ కోసం లూయిస్ రాబర్ట్స్‌ను తీసుకెళ్తున్నప్పుడు,  అకస్మాత్తుగా అతడు శ్వాసించడం ప్రారంభించాడు. అతని శరీర భాగాలలో కూడా స్పందన వచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే లూయిస్ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడు లూయిస్ చికిత్స కోసం నిధులు సేకరిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు లూయిస్‌కు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అతను పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకుంటున్నారు.  అయితే, అతడి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని.. మరికొన్ని రోజులు అతన్ని పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు సూచించారు.

Also Read: తిరుమల వెంకన్న భక్తులకు శుభవార్త.. గదుల కోసం ఇకపై వెయిటింగ్‌కు చెక్

కోవిడ్‌ సంక్షోభంలో సెలూన్‌ షాపు యజమాని ఔదార్యం.. ప్రైవేటు టీచర్లకు ఉచిత సేవలు