AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NASA: మగువలు కూడా ముందే.. చంద్రుడిపై కాలుమోపనున్న నారీమణి.. ఎవరో తెలుసా?

NASA Moon Mission: చంద్రుడి మీద మొదటగా నీల్ అర్మ్ స్ట్రాంగ్ కాలు పెట్టారని అందరికీ తెలిసిందే. కానీ మహిళలేవరు ఇంతవరకు చంద్రునిపై కాలు మోపలేదు. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది.

NASA: మగువలు కూడా ముందే.. చంద్రుడిపై కాలుమోపనున్న నారీమణి.. ఎవరో తెలుసా?
Christina Koch
Aravind B
|

Updated on: Apr 04, 2023 | 3:45 PM

Share

చంద్రుడి మీద మొదటగా నీల్ అర్మ్ స్ట్రాంగ్ కాలు పెట్టారని అందరికీ తెలిసిందే. కానీ మహిళలేవరు ఇంతవరకు చంద్రునిపై కాలు మోపలేదు. అయితే ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. అమెరికాకు చెందిన క్రిస్టినా హామ్మొక్ కోచ్ అనే మహిళ వ్యోమగామి చంద్రని మీద అడుగుపెట్టబోయే మొదటి మహిళగా రికార్డు సృష్టించనున్నారు. ఈ విషయాన్ని నాసా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అర్టెమిస్ II లూనార్ మూన్ టీమ్ లోని నలుగురు సభ్యల్లో క్రిస్టినా కోచ్ ఒకరు. అయితే ఈ మిషన్ లో ఆమెతో పాటు జెరెమీ హన్సెన్, విక్టర్ గ్లోవర్ , రెయిడ్ వైజ్ మెన్ భాగస్వామ్యం కానున్నారు. ఈ వ్యోమగాములు చంద్రునిపైకి వెళ్లాక అక్కడ సుమారు పదిరోజుల పాటు పరిశోధనలు చేయనున్నారు.

అయితే క్రిస్టినా కోచ్ 2019లోనే స్పేస్ స్టేషన్ కి వెళ్లారు. 2013లో ఆమె నాసాలో చేరారు. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఫ్లైజ్ ఇంజనీర్ గా ఆమె పనిచేశారు. చంద్రుని మీదకి వెళ్లే సమయం రావడంతో క్రిస్టినా ఆనందం వ్యక్తం చేశారు. ఈ మిషన్ లో పాల్గొనడం గర్వంగా ఉందని..చంద్రుని పైకి వెళ్తామనే ఆలోచన థ్రిల్లింగా ఉందని పేర్కొన్నారు. అయితే 2024లో అర్టెమిస్ II లూనార్ మూన్ మిషన్  చంద్రునిపైకి వెళ్లనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us