Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkey B Virus: మనుషుల్లో తొలిసారి.. చైనాలో మంకీ బీ వైరస్ గురింపు.. బాధితుడు మృతి.!

Monkey B Virus: కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న యావత్‌ ప్రపంచాన్ని.. ఇప్పుడు మరో రెండు వైరస్‌లు భయాందోళనకు..

Monkey B Virus: మనుషుల్లో తొలిసారి.. చైనాలో మంకీ బీ వైరస్ గురింపు.. బాధితుడు మృతి.!
Monkey 1
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 17, 2021 | 5:50 PM

కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న యావత్‌ ప్రపంచాన్ని.. ఇప్పుడు మరో రెండు వైరస్‌లు భయాందోళనకు గురిచేస్తోంది. అమెరికాలో మంకీ పాక్స్‌ వైరస్‌ కలకలం రేపుతుండగా, తాజాగా చైనాలో మంకీ బీ వైరస్‌ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. చైనాలో మంకీ బీ వైరస్‌ సోకి బీజింగ్‌కు చెందిన ఓ పశువుల వైద్యుడు కన్నుమూశాడు. ఈ వైరస్‌తో సోకిన తొలి మానవ కేసుగా చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. అయితే అతనితో సన్నిహితంగా మెలిగిన వారు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్టు తెలిపింది.

నాన్‌-హ్యూమన్‌ ప్రైమేట్లపై పరిశోధన చేస్తున్న సంస్థలో పనిచేసే పశువైద్యుడు మంకీ బీవీ వైరస్‌ బారినపడ్డాడు. మొదట వికారం వాంతులు లాంటి లక్షణాలతో బాధపడ్డాడు. అనేక ఆసుపత్రులలో చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో చివరికి మే 27న మరణించాడు. ఇక అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ వ్యక్తికి అరుదైన, మంకీ పాక్స్ వ్యాధి సోకింది. ఆ దేశంలోనే ఇది తొలి కేస్‌ అని అంటువ్యాధుల నివారణా విభాగం అధికారులు తెలిపారు. ఇటీవల నైజీరియాకు వెళ్లి వచ్చిన ఈ వ్యక్తికి ఈ డిసీజ్ సోకిందని, అతడిని డల్లాస్‌లోని ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

ఈ వ్యాధి ప్రజలకు ముప్పు కాకపోవచ్చునని అంటూనే.. వారు ఈ వ్యాధిపట్ల అత్యంత అప్రమత్తత అవసరమని కూడాహెచ్చరించారు వైద్యులు. మంకీ వైరస్‌ సోకిన వ్యక్తితో ప్రయాణికుల్లో ఎవరైనా కాంటాక్టులో ఉన్నారా లేదా.. అన్న విషయాన్ని కనుగొనేందుకు ఎయిర్ లైన్స్‌తో పాటు స్థానిక అధికారులు కూడా ఆరా తీస్తున్నామని తెలిపింది అంటువ్యాధుల నివారణా విభాగం.

Also Read:

గోడ నుంచి వింత శబ్దాలు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!

తవ్వకాల్లో బయటపడ్డ మనిషి పుర్రెల టవర్.. దాని హిస్టరీ తెలుసుకుని పరిశోధకులు షాక్.!

చిన్నారిపై పగబట్టిన పాము.? జెట్ స్పీడ్‌తో దూసుకొచ్చి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!