Saudi Arabia: కార్మిక చట్టాలపై అవగాహన కోసం సరికొత్త సేవలు.. సౌదీ ఆరేబియా న్యాయశాఖ కీలక నిర్ణయం
Saudi Arabia: కార్మికుల చట్టాలపై సరైన అవగాహన లేక, వేతన బకాయిల వివరాలు తెలియక ఇబ్బందులు పడే కార్మికుల కోసం సౌదీ ఆరేబియా న్యాయమంత్రిత్వశాఖ కీలక.
Saudi Arabia: కార్మికుల చట్టాలపై సరైన అవగాహన లేక, వేతన బకాయిల వివరాలు తెలియక ఇబ్బందులు పడే కార్మికుల కోసం సౌదీ ఆరేబియా న్యాయమంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందకు సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. లేబర్ కాలుక్యులేటర్ పేరిట ఈ-సర్వీసును ప్రారంభించింది. కార్మికుల్లో చట్టపరమైన అవగాహనను ప్రోత్సహించడమే ఈ కార్మిక కాలిక్యులేటర్ సర్వీసు ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా కార్మిక చట్టాల్లోని బకాయి వేతనాలు, సర్వీసు తర్వాత అందించే బెనిఫిట్స్, ఒమర్ టైమ్‌తో పాటు అర్థాంతరంగా కార్మికుడిని పనిలోంచి తొలగించినప్పుడు అందాల్సిన పరిహారం వివరాలు, వెకేషన్ పే వంటి వాటిని దీని ద్వారా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వినియోగదారులకు సులభంగా అర్థమయ్యేలా కార్మిక చట్టంలోని అతి ముఖ్యమైన సెక్షన్లు అన్నింటినీ ఒకే పేజీలో సమగ్రంగా పొందుపర్చినట్లు న్యాయశాఖ వెల్లడించింది. అవసరమైతే కార్మిక కాలుక్యులేటర్ ఫలితాలను ప్రింట్ కూడా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ సరికొత్త సేవలతో కార్మికులకు ఎంతో మేలు జరగనుంది. https://www.moj.gov.sa/ar/eServices/Pages/Details.aspx?itemId=152 లింక్ ద్వారా లేబర్ కాలుక్యులేటర్ సేవలను పొందవచ్చు.