Hero Rat Magawa: ఇది మామూలు ఎలుక కాదండోయ్.. మనషులు 4 నాలుగు రోజుల్లో చేసే పని 20 నిమిషాల్లోనే చేసేస్తుందట..!
Hero Rat Magawa: పిట్ట కొంచెం కూత ఘనం అంటారు కదా.. ఈ సామెత అచ్చంగా ఈ ఎలుకకు వర్తిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే తన తెలివి తేటలతో..
Hero Rat Magawa: పిట్ట కొంచెం కూత ఘనం అంటారు కదా.. ఈ సామెత అచ్చంగా ఈ ఎలుకకు వర్తిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే తన తెలివి తేటలతో ఎంతో మంది ప్రాణాలను కాపాడి హీరో ర్యాట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ఇది మామూలు ఎలుక కాదు.. డిటెక్టివ్ ఎలుక. మందుపాతర్లను కనిపెట్టడంలో ఆరితేరిన ఈ ఎలుక పేరు ‘మగావా’. ఇది ఏకంగా 71 మందు పాతర్లను గుర్తించి గోల్డ్ మెడల్‌తో సత్కారం అందుకుంది. ఇతర ఎలుకల కన్నా కొంచెం పెద్ద సైజులో ఉన్న ఈ ఎలుక బరువు 1.2 కిలోలు ఉంటుంది. ఎత్తు 45 సెంటీమీటర్లు ఉంటుంది. ఆఫ్రికాకు చెందిన జెయింట్ పౌచ్ ర్యాట్ సంతతికి చెందిన ఈ ఎలుక.. మందు పాతరలు ఉన్న ప్రాంతం నుంచి వెళితే పేలే అవకాశాలే లేవట.
మగావా హీరోర్యాట్ గా ఎలా మారింది…. కాంబోడియాలో 60 లక్షల మందు పాతర్లు ఉన్నట్లు మైన్ యాక్షన్ సెంటర్(సీఎంఏసీ) గుర్తించింది. ఆ క్రమంలో 1990 నుంచి బెల్జియంకు చెందిన స్వచ్ఛంద సంస్థ అపోపో ఎలుకలను పెంచుతోంది. అలా పెంచిన ఎలుకలకు మందుపాతర్లను వెదకటంలో సంవత్సరం పాటు శిక్షణ ఇస్తూ హీరోరాట్స్ అంటూ సర్టిఫికెట్ జారీ చేస్తోంది. ఈ ఎలుకలు వాసన ద్వారా మందు పాతర్లను గుర్తిస్తాయని అపోపో సంస్థ చెబుతోంది. అయితే, మగావా అని పిలువబడుతున్న ఈ ఎలుక గత ఐదు సంవత్సరాలుగా సీఎంఏసీలో పని చేస్తోంది.
ప్రస్తుతం ఈ హీరో ర్యాట్ పదవీ విరమణ తీసుకోనున్నదట. ఈ నేపథ్యంలో అపోపో సంస్థ మరికొన్ని ఎలుకలకు శిక్షణ ఇచ్చి సీఎంఏసీకి అప్పగించింది. అలా కొత్తగా వచ్చిన ఎలుకలకు అక్కడి పరిసరాలు, పరిస్థితులపై ఈ సీనియర్ ఎలుక మగావా శిక్షణ ఇస్తోందట. మగావా ఎలుక టెన్నిస్ కోర్టు అంత ప్రాంతాన్ని కేవలం 20 నిమిషాల్లోనే శోధించి మందు పాతరల గుట్టును రట్టు చేస్తుందట. అదే మనుషులకైతే నాలుగు రోజుల సమయం పడుతుందట. ఇంతటి ఇంటెలిజెన్స్ ఈ మగావా హిరో ర్యాట్‌ను ప్రశంసించకుండా ఉండగలమా? చెప్పండి. అందుకే దీని గురించి తెలిసిన ప్రతీ ఒక్కరు శభాష్ మగావా అంటున్నారు.
Also read: