WHO: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 200 కోట్ల టీకా డోసుల పంపిణీ: డబ్ల్యూహెచ్‌వో వెల్లడి
Vaccine Doses Distribution: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 200 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ఇందులో 60శాతం డోసులు..

Vaccine Doses Distribution: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 200 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ఇందులో 60శాతం డోసులు మూడు దేశాలే వినియోగించుకున్నాయని, అమెరికా, భారత్, చైనా దేశాలే ఎక్కువ శాతం టీకాలను పొందినట్లు పేర్కొంది. 212 దేశాల్లో బ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, అందులో 10 దేశాలే 75 శాతం వ్యాక్సిన్లను పొందినట్లు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ తెలిపారు.127 దేశాలకు వ్యాక్సిన్ల సరఫరా చేయడంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. చాలా దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు కొవాగ్జిన్ ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 10శాతం జనాభా కలిగిన తక్కువ ఆదాయ దేశాలకు కేవలం 0.5 శాతం టీకాలు మాత్రమే పంపిణీ జరిగినట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. చిన్నారులకు కరోనా టీకాలు వేయడం తమ దృష్టిలో అంత ప్రాధాన్యం కాదని పేర్కొంది. చిన్న పిల్లలపై మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉండదని, ప్రాణాంతకం కూడా కాబోదని వెల్లడించింది.
