Plane Crash: గాలిలోనే కలిసిపోయిన ప్రాణాలు.. బిల్డింగ్‌పై కూలిన విమానం.. ఎనిమిది మంది దుర్మరణం..

Milan Plane Crash: ఇట‌లీలోని మిలాన్ న‌గ‌రంలో ఓ ప్రైవేటు విమానం కుప్పకూలింది. ఈ దారుణ ఘ‌ట‌న‌లో ఎనిమింది మంది దుర్మరణం చెందారు. ఖాళీగా ఉన్న

Plane Crash: గాలిలోనే కలిసిపోయిన ప్రాణాలు.. బిల్డింగ్‌పై కూలిన విమానం.. ఎనిమిది మంది దుర్మరణం..
Milan Plane Crash
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 04, 2021 | 12:54 PM

Milan Plane Crash: ఇట‌లీలోని మిలాన్ న‌గ‌రంలో ఓ ప్రైవేటు విమానం కుప్పకూలింది. ఈ దారుణ ఘ‌ట‌న‌లో ఎనిమింది మంది దుర్మరణం చెందారు. ఖాళీగా ఉన్న ఓ బిల్డింగ్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఇటలీ అధికారులు వెల్లడించారు. అయితే విమానంలో ఉన్న వారే మరణించారని.. బిల్డింగ్ ఎవరూ లేకపోవడంతో మరణాల సంఖ్య తగ్గినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మిలాన్‌లోని లినేట్ విమానాశ్రయం నుంచి స‌ర్డినియా దీవికి వెళ్తున్న స‌మ‌యంలో ఈ ప్రయాదం జ‌రిగింది. రొమేనియాకు చెందిన బిలియ‌నీర్ డాన్ పెట్రెస్కూ ఆ విమానానికి పైలెట్‌గా ఉన్నారు. ఆయ‌న‌తో పాటు ఆయ‌న భార్య, కుమారుడు, మరో ఐదుగురు ప్రతినిధులు ఉన్నారని అధికారులు తెలిపారు. విమానం కూలిన బిల్డింగ్ ఆఫీసు పూర్తిగా ధ్వంస‌మైంది. అక్కడ ఉన్న కార్లకు, ఫర్నిచర్‌కు నిప్పు అంటుకుని భారీగా మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ప్రమాదంపై విచార‌ణ జరుగుతోందని మిలాన్ పోలీసు అధికారులు పేర్కొన్నారు. సింగిల్ ఇంజిన్ పీసీ-12 విమానం గాలిలో ఉన్నప్పుడే మంట‌లు చెలరేగాయని ప్రత్యేక్ష సాక్ష్యులు తెలిపారు. డాన్ పెట్రెస్కూ ఓ ప్రాప‌ర్టీ డెవ‌ల‌ప‌ర్‌ అని.. ఆయ‌న రొమేనియాలో సంప‌న్నుడని అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో ముగ్గురు రొమేనియన్లు, ఇద్దరు ఫ్రెంచ్ వారు, ఇటాలియన్, కెనడియన్ పౌరులు ఉన్నారని అధికారులు బులెటిన్‌ను విడుదల చేశారు. విమానం బయలు దేరిన కొన్ని నిమిషాల్లోనే రాడార్ వ్యవస్థతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు.

Also Read:

Crime News: కీచక తండ్రి.. మద్యం తాగించి కన్న కూతురిపైనే అఘాయిత్యం.. ఆ తర్వాత వీడియోలు తీసి..

Mobile Game: హైదరాబాద్‌లో విషాదం.. ఫోన్‌లో గేమ్ ఆడొద్దన్నందుకు బాలిక బలవన్మరణం.. రాత్రి వేళ ఇంట్లో..