Russia Ukraine War: రష్యాకు షాకిచ్చిన ఉక్రెయిన్.. క్రిమియాను కలిపే కెర్చ్ వంతెన పేల్చేసిన బలగాలు..! వీడియో..
కొన్ని నెలలుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. కీలక మలుపు తిరిగింది. రష్యా ఆక్రమణలో ఉన్న కీలకమైన క్రిమియా బ్రిడ్జిని ఉక్రెయిన్ బలగాలు పేల్చేశాయి.

కొన్ని నెలలుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. కీలక మలుపు తిరిగింది. రష్యా ఆక్రమణలో ఉన్న కీలకమైన క్రిమియా బ్రిడ్జిని ఉక్రెయిన్ బలగాలు పేల్చేశాయి. ట్రక్కు బాంబులతో అ వంతెనను పేల్చేసినట్టు సమాచారం.. అయితే బ్రిడ్జిపై ట్యాంకర్ పేలడంతో కెర్చ్ వంతెన కూలినట్టు రష్యా ప్రభుత్వం చెబుతోంది. ఈ పేలుడుతో క్రిమియాతో రష్యాకు లింక్ తెగిపోయింది. బ్రిడ్జి పేల్చివేతపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. పేలుడులో ఉక్రెయిన్ పాత్ర ఉన్నట్టు తేలితే కఠినచ్యలు తప్పవని హెచ్చరించారు. అమెరికా సాయంతో ఉక్రెయిన్ బలగాలు ఈ వంతెనను పేల్చేసినట్టు రష్యా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే ఘటనా స్థలానికి డిటెక్టివ్‌లను పంపినట్లు దర్యాప్తు కమిటీ తెలిపింది.
ఉక్రెయిన్ నుంచి 2014లో క్రిమియా ప్రాంతాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. రష్యా-క్రిమియాకు మధ్య రవాణాకు ఈ వంతెనను ఉపయోగిస్తున్నారు. 2018లో ఈ బ్రిడ్జిని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రారంభించారు. పేలుడు కారణంగా ఈ వంతెనలో చాలా భాగం డ్యామేజ్ అయ్యింది. బ్రిడ్జి కూలి సముద్రంలో పడిపోయింది.
క్రిమియా వంతెనను తామే పేల్చినట్టు ఉక్రెయిన్ ప్రకటించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. కాగా, యుద్ధం జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ ఈ ఘటనకు పాల్పడటం కలకలం రేపింది. అయితే.. ఉక్రెయిన్ ప్రకటన నేపథ్యంలో పుతిన్ మరోసారి దాడులకు ఆదేశమిచ్చే అవకాశముందని తెలుస్తోంది.
ప్రస్తుతం.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రిడ్జిపై రాకపోకలు సాగుతున్న క్రమంలో.. ఓ ట్రక్కు ఆకస్మాత్తుగా పేలిపోతుంది. దీంతో భారీగా మంటలు చెలరేగి.. కొంత భాగం సముద్రంలో కూలిపోతుంది.
Crimean bridge this morning. pic.twitter.com/chmoUEIxt7
— Anton Gerashchenko (@Gerashchenko_en) October 8, 2022
దీనిపై పలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాగా.. దీనిపై రష్యా ఏ విధంగా స్పందిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..